Viral video: సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంత మంది పిచ్చి పనులు చేస్తూ ప్రాణాలను కొని తెచ్చుకుంటారు. ముఖ్యంగా రోడ్లపై ఇష్టారీతిన డ్రైవింగ్ చేస్తున్నారు. యూపీలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఒక యువకుడు అత్యంత డేంజర కారు స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే సీన్ కట్ చేస్తే స్టంట్ చేసిన వ్యక్తి బిగ్ షాకే తగిలింది. పోలీస్ అధికారులు అతనికి రూ.57,500 భారీ జరిమానా విధించబడింది.
A guy performed stunts with his car on
the streets of Greater Noida. 🚗💨
Noida Traffic Police took action and imposed a fine of ₹57,500.
Good Job, @Noidatraffic 👏👏 pic.twitter.com/Qn1nmGpmJj— Greater Noida West (@GreaterNoidaW) October 10, 2025
ఈ వీడియో సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియోలో మారుతి సుజుకీ బాలెనో కారు అతివేగంతో దూసుకుపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే నియంత్రణ కోల్పోయినట్లుగా పక్కకు తిప్పనట్టు వీడియోలో తెలుస్తోంది. క్లిప్ ప్రారంభంలో, కారు ఒక ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తుండగా.. వెనుక నుంచి మరొక వాహనంలో వీడియో తీస్తున్నారు. అకస్మాత్తుగా ఒక్కసారిగా కారును పక్కక తిప్పి రోడ్డుకు అడ్డంగా పెడుతుంటాడు. ఆపై ఒక్కసారిగా ఆపేస్తాడు. వీడియో తరువాతి భాగంలో అదే కారు ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ముందు కూడా ఈ ప్రమాదకరమైన స్టంట్ ను చేశారు.
ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అయింది. దీంతో వెంటనే నోయిడా ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. అతివేగంతో కూడిన ప్రమాదకరమైన స్టంట్స్ చేసినందుకు గానూ సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల పోలీసులు భారీ చలానా విధించారు. ఆ చలాన్‌లో మొత్తం రూ.57,500 విధించినట్లు పేర్కొనబడింది. ఈ వీడియోను మొదట ఎక్స్‌లో.. ‘గ్రేటర్ నోయిడా రోడ్లపై ఒక యువకుడు కార్ స్టంట్స్ చేశాడు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు చర్య తీసుకుని ₹57,500 జరిమానా విధించారు.., నోయిడా ట్రాఫిక్ పోలీసులు అనే శీర్షికతో పోస్టు చేశారు.
ALSO READ: IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి
ఈ సంఘటన బహిరంగ రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ కు పాల్పడడం ఎంత వరకు చట్ట విరుద్ధమో.. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఎలాంటి భారీ పరిణామాలు ఎదురువుతాయో మరోసారి స్పష్టం అయ్యింది.