E-Paper
Advertisement

Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?

Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?
Advertisement

Raviteja: మాస్ మహారాజా రవితేజ(Ravi teja) ప్రస్తుతం మాస్ జాతర(Mass Jathara) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.. ఇదిలా ఉండగా మరొక యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda)తో కలిసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బయోపిక్ సినిమాల(Biopic Movies) గురించి ప్రస్తావనకు రావడంతో సిద్దు జొన్నలగడ్డ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

స్టార్ హీరో బయోపిక్ లో రవితేజ?

నేను కృష్ణ అండ్ హిస్ లీల సినిమా తరువాత తాను మీ బయోపిక్ సినిమా చేయాలనుకున్నాను అంటూ రవితేజను ఉద్దేశించి మాట్లాడారు. ఈ బయోపిక్ సినిమా కోసం తాను కొంచెం వర్క్ కూడా చేశానని అయితే కొన్ని కారణాలవల్ల అది వర్కౌట్ కాకపోవడంతో పక్కన పెట్టేసానని తెలిపారు. అదేవిధంగా రవితేజ కూడా తాను ఒక స్టార్ హీరో బయోపిక్ సినిమా చేయాలనుకున్నాను అని తెలియజేశారు. కానీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం చెప్పకుండా దాటవేశారు. అయితే రవితేజ ఏ హీరో బయోపిక్ సినిమా చేయాలనుకున్నారంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో వస్తున్న బయోపిక్ సినిమాలలో కేవలం పాజిటివ్ వీటిని మాత్రమే చూపిస్తున్నారని రవితేజ వెల్లడించారు.

బయోపిక్ అంటే నెగిటివిటీ కూడా చూపించాలి..

Advertisement

ఒక వ్యక్తికి సంబంధించిన బయోపిక్ సినిమా చేస్తే కనుక ఖచ్చితంగా వారిలో ఉన్న పాజిటివిటీ మాత్రమే కాకుండా నెగెటివిటీని కూడా చూపించినప్పుడు అది పర్ ఫెస్ట్ బయోపిక్ సినిమా అవుతుందని రవితేజ వెల్లడించారు. ఇలా బయోపిక్ సినిమాల గురించి రవితేజ చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అది నిజమేనని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఒక హీరో లేదా సెలెబ్రెటీ బయోపిక్ చేస్తే వారికి సంబంధించిన నెగెటివిటీలను పెడితే సినిమాపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో నెగిటివిటీ నుంచి పక్కన పెట్టేస్తున్నారు. బయోపిక్ చేస్తే వారికి సంబంధించిన అన్ని విషయాలను చూపించాలని రవితేజ తెలిపారు.

రవితేజ బయోపిక్ సినిమా..

Advertisement

ఇక రవితేజ బయోపిక్ సినిమా చేస్తే ఖచ్చితంగా అది బ్లాక్ బస్టర్ అవుతుందనే చెప్పాలి. ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గాను క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనంతరం హీరోగా అవకాశాలను అందుకుంటూ నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ నేడు ఇండస్ట్రీలో హీరోగా, థియేటర్ ఓనర్ గా కొనసాగడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇలా రవితేజ బయోపిక్ చేస్తే కనుక బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడి.

Also Read: SSMB 29: మార్కెట్లోకి SSMB 29 పెండెంట్స్..ఒక్క పోస్టర్ తో భారీ హైప్.. ఇదెక్కడి క్రేజ్ రా బాబు!

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×