BigTV English

Mobile Charging : చేతితో పట్టుకుంటే చాలు..! ఫోన్‌కు ఛార్జింగ్ అందినట్టే..!

Mobile Charging :  చేతితో పట్టుకుంటే చాలు..! ఫోన్‌కు ఛార్జింగ్ అందినట్టే..!


Mobile Charging : శరీరంలో ఇంటర్నల్ ఎనర్జీతో పాటు బయటవాటిని ఆకర్షించే ఎనర్జీ కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు పలుమార్లు చెప్తున్నారు. ఆ ఎనర్జీ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వారు బయటపెట్టారు. ప్రస్తుతం మనుషుల అవసరాలకు తగినట్టుగా కరెంటు సరిపోవడం లేదు. అందుకే శాస్త్రవేత్తలు వేర్వేరు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నారు. అందులో మనిషి శరీరం కూడా ఒకటని వారు అంటున్నారు.. ఇదెలా సాధ్యమని చాలామంది అనుమానిస్తున్నా.. శాస్త్రవేత్తలు మాత్రం దీనిని నిజం చేసి చూపిస్తామంటున్నారు.

థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్‌ ద్వారా వేడిని కరెంటుగా మార్చడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. కరెంటు అవసరాలను తీర్చడం కోసం తాజాగా సోలార్ పవర్ అనే ఐడియా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. చాలావరకు ఇతర దేశాల్లోనే కాకుండా ఇండియాలో కూడా సోలార్ పవర్‌పై ఆధారపడుతున్న మనుషుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కేవలం సోలార్ పవర్ మాత్రమే కాకుండా మరెన్నో ఇతర ప్రత్యామ్నాయాలు కూడా మనుషుల కరెంటు అవసరాలను తీరుస్తుందని తెలిపారు.


శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త ప్రక్రియతో కరెంటును తయారు చేయడం కోసం పెద్ద పెద్ద పరికరాలు, సూర్యుడి లాంటి వేడి ఆబ్జెక్ట్స్ ఏమీ అవసరం లేదని వారు చెప్తున్నారు. కేవలం మనిషి శరీరంలోని హీట్‌తోనే చాలావరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. మామూలుగా మనిషి పనిచేస్తున్నప్పుడు చాలా హీట్ అనేది ఉత్పత్తి అవుతుందని, కాకపోతే అదంతా వాతావరణంలోకి వెళ్లిపోయి వృథా అవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అందుకే దీనిని థెర్మల్ పవర్‌తో కరెంటుగా మార్చాలనే ఆలోచనతో ముందుకొచ్చారు.

కేవలం గ్యాడ్జెట్స్ మాత్రమే కాకుండా ఆటోమొబైల్స్ ఛార్జ్ చేయడానికి కూడా బాడీలోని హీట్ అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. హీట్‌ను కరెంటుగా మార్చడం కోసం వారి తగ్గర చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందులో ఒకటి థెర్మో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ పద్ధతి అని చెప్పారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక ప్రోటోటైప్ మోడల్‌ను వారు సిద్ధం చేసి పెట్టారు. ఈ టెక్నాలజీ సక్సెస్ అయితే ఫోన్స్‌ను చేతితో పట్టుకోవడంతో, ల్యాప్‌టాప్స్‌ను ఒడిలో పెట్టుకోవడంతోనే ఛార్జ్ అయిపోతాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. కానీ ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు ప్రారంభం దశలోనే ఉన్నాయన్నారు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×