Flipkart BBD Sale: ప్రతి ఏటా పండుగల సీజన్ రాగానే షాపింగ్ ప్రియులకు ఎదురయ్యే అతిపెద్ద ప్రశ్న.. ‘ఐఫోన్‌ను ఇప్పుడే కొనాలా? లేక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (BBD) సేల్ కోసం ఆగాలా?. అయితే ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకోవడం మరింత సవాలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు అక్టోబర్ ప్రారంభంలోనే ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రారంభం కానుందనే ప్రచారాలు.. మరోవైపు మార్కెట్‌లో మెమెురీ చిప్‌ల ధరలు పెరగడం కొనుగోలు దారులను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ సేల్ తేదీలు, ఐఫోన్ మెుబైల్ పై ఆఫర్ల అంచనాలను గురించి ఈ కథనంలో విశ్లేషిద్దాం.
ఈ ఏడాది బిగ్ బిలియన్ డేస్ సేల్ షెడ్యూల్‌పై ఫ్లిప్‌కార్ట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే సోషల్ మీడియాలో లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ మెగా సేల్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Plus) సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 8 నుంచే డిస్కౌంట్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. గతంలో సెప్టెంబర్ ఆఖరి వారంలోనే ప్రారంభమైన ఈ సేల్.. ఈసారి కాస్త ఆలస్యంగా అక్టోబర్‌లో ప్రారంభం కానుండడం గమనార్హం.
Flipkart Big Billion Days Starts from 9th Oct in 🇮🇳🇮🇳🇮🇳
Early access starts from 8th Oct
10% inst disc on ICICI, Axis Banks
12% disc for all Plus Members
So Many deals are included in this sale…#Flipkart #BigBillionDaysSale pic.twitter.com/sPKfFCzLXr
— Ravi Kiran – Tech Influencer (@Ravikrn36) September 10, 2026
ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ప్రమోషనల్ పోస్టర్లను బట్టి.. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అయితే క్యాష్‌బ్యాక్ పరిమితులు, మినిమమ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ వంటి పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
యాపిల్.. ఐఫోన్ 18 సిరీస్‌ను కాకుండా ప్రో, ప్రొ మ్యాక్స్, ఫోల్డబుల్ మోడళ్లను ముందుగా మార్కెట్‌లోకి తెస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఐఫోన్ 17 డిస్కౌంట్లపై దీని ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సాధారణంగా పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల వల్ల ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 17 పై డిస్కౌంట్ విధానం అంచనాలకు భిన్నంగా ఉండే ఛాన్స్ ఉందని ఈ-కామర్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఏఐ డేటా సెంటర్ల నుంచి డ్రామ్ (DRAM), నాండ్ (NAND) మెమరీ చిప్‌లకు విపరీతంగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఫలితంగా గ్లోబల్‌గా హార్డ్‌వేర్ తయారీ ఖర్చులు పెరిగాయి. భారతీయ డీలర్ల సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17 (256GB) బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 12,000 వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. దీంతో ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ప్రీవియస్ మోడల్స్ పై భారీ డిస్కౌంట్ ను ఆశించడం కష్టమేనన్న ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఐఫోన్ 16 మెుబైల్.. ఫ్లిప్ కార్ట్ సేల్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచే ఛాన్స్ ఉందని ఈ కామర్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత బ్యాంకింగ్, పండుగ ఆఫర్లను గమనిస్తే ఈ మోడల్ (128GB) రూ. 49,000 నుంచి రూ. 53,000 ధరల శ్రేణిలో లభిస్తే బెస్ట్ డీల్ అవుతుందని పేర్కొంటున్నాయి. రూ. 55,000 కంటే ఎక్కువ ఉంటే అది అంత గొప్ప ఆఫర్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నాయి. ఇక ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900 కాగా సాధారణ రోజుల సగటు సేల్ ధర రూ. 1,25,010 వరకు ఉంది. యాపిల్ ఈవెంట్ ముగిసిన వెంటనే ఇది రూ 7,000 పైగా తగ్గింపుతో లభించే అవకాశం ఉంది.
Also Read: ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!
బిగ్ బిలియన్ డేస్ సమయంలో కస్టమర్లు కేవలం బ్యానర్లపై కనిపించే 20% తగ్గింపు లేదా ఎం.ఆర్.పీ ధరలను చూసి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. గత 30 రోజులు లేదా 90 రోజుల ధరలతో ప్రస్తుత సేల్ ధరను సరిపోల్చుకొని నిర్ణయం తీసుకోవడం బెటరని సూచిస్తున్నారు. ఐఫోన్ 16ని రూ. 49,000 – 53,000 మధ్య, అలాగే ఐఫోన్ 17ని రూ. 67,000 లేదా అంతకంటే తక్కువ ధరలో లభిస్తేనే ఆ డీల్ లాభదాయకంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.