Gundeninda GudiGantalu Today episode September 18th: రోహిణి మనోజ్ కి ఇంకా తగ్గలేదు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి మన లేవగానే మనం ఇప్పుడు నీకు ఎలా ఉంది పర్వాలేదా అని అడుగుతుంది నేను మా అమ్మని అడిగి జావా ఇప్పించుకుంటాను అని. అనగానే దానికోసం అత్తయ్య గారి వర్క్ ఎందుకు వెళ్లడం నేను నీకు జావా చేసి ఇస్తాను అని రోహిణి అంటుంది. కానీ రోహిణి ఎంత చెప్పినా సరే మనోజ్ మాత్రం మా అమ్మ కావాలి అని అడుగుతాడు. నేను నీకోసం జావా తీసుకొని వస్తాను అని రోహిణి వంటగదిలోకి వెళుతుంది. నేనను కాఫీ ఇవ్వమని అడక్కని రోహిణి రెండు స్టవ్వులు వాడేస్తుంది అని చెప్తుంది. రోహిణి మనోజ్ కోసం జావ కాస్తుంది అని ప్రభావతితో చెప్పగానే చాలా సీరియస్ గా వెళ్లి రోహిణి అడుగుతుంది..
ప్రభావతి వంటగదిలో జామ కాస్తున్న రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఏం చేస్తున్నావే మాయలాడి ఏం కలిసావే ఇందులో అంటూ అనగానే రోహిణి ఒక్కసారిగా భయపడిపోతుంది. జావ కాస్తున్న అత్తయ్య మనోజ్ కి ఆకలేస్తుంది అంటే జావ కాయడానికి వచ్చాను అని చెప్పగానే నువ్వు ఎవరివి నా కొడుకుకి జావా ఇవ్వడానికి.. అదేంటత్తయ్య మనోజ్ కి బాగోలేదు కదా అందుకే జావా తీసుకొని వచ్చాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు అని ఎంత చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం అస్సలు వినదు. అయితే ప్రభావతి బలవంతంగా రోహిణి బయటకు తీసుకురావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇలా చేస్తావని అసలు ఊహించలేదు.. అయినా నా కొడుకుకి ఏదైనా చేయాలి అంటే నేనున్నాను కదా నువ్వెందుకే మాయలాడి వాడి దగ్గరకు పోతావు అంటూ ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది.
రోహిణి నా భర్తకి సేవ చేయడంలో తప్పేంటి అత్తయ్య నేను ఇప్పుడేం తప్పు చేశానని మీరు నన్ను ఇలా నిందిస్తున్నారు అని ఎంతగా అడుగుతున్న సరే ప్రభావతి మాత్రం నోరు ముయ్యవే నువ్వు ఒక మాయలాడివి.. నా చేతిని కట్ చేసి ఇంటిని అమ్మేసి మళ్లీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటావు అలాంటి దానివి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? అసలు నువ్వు ఎందుకు నా కొడుకు జోలికి వెళ్తున్నావు నీకు వెళ్ళద్దని చెప్పాను కదా అని ప్రభావతి ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం అతను నా భర్త అతనికి నేను సేవ చేయడం తప్పేమీ కాదు కదా అని అంటుంది.. నేను లేకుండా నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు ఏం మాట్లాడుతున్నావే వగలాడి అంటూ రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా ప్రభావతి వరుసగా షాకులు ఇస్తుంది. ఎందుకమ్మా నువ్వు లేనిపోని సలహాలు ఇస్తావు అవి చేసినా కూడా చేస్తుంది అని బాలు అంటాడు.
నువ్వు వరలక్ష్మీ వ్రతం చేయకుండా వెళ్లడం వల్లే నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నా కొడుకుకి ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వు ఆ రోజు వ్రతం చేయకపోవడమే ముమ్మటికి కారణం అని ప్రభావతి అంటుంది. మీ అబ్బాయి ఫోన్ చేస్తే ఎక్కడ తాగుతూ ఉంటాడో అని నేను వెళ్ళాను. ఆ వల్లే తాగుతున్నాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్లి తీసుకురావాలి అనుకున్నాను అని రోహిణి అంటుంది. అందరికీ చెప్పి మనోజ్ ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అలానే వదిలేస్తే బాలు లాగా ఎక్కడ తాగుబోతు అవుతాడు అని వెళ్లి తీసుకురావడానికి అనుకున్నాను. అది నేను చేసిన తప్ప అని అనగానే.. ఏమన్నావ్ నా మొగుడు తాగుబోత.. అసలు ఎవరి డబ్బులు తీసుకొని తాగాడు ఎవరిని మోసం చేశాడు ఎవరి నగలు అమ్ముకొని తాగి వచ్చాడు అంటూ మేన రోహిణికి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. నేను రతన్ చెయ్యకపోవడం వల్లే మనోజ్ కి జ్వరం వచ్చింది అంటున్నారు కదా అని రోహిణి చేతులో హారతిని వెలిగించుకొని దేవుడికి హారతిస్తుంది..
మీనా బాలు ఇద్దరు కూడా రోహిణి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. అంత వగలాడి ఇప్పుడు అన్ని చేస్తుంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను.. చేసినంత చేసి ఇప్పుడు భర్తకి బాగోలేదు అని నాటకాలు మొదలు పెట్టింది అని ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రోహిణి గురించి మాట్లాడుతూ ఉంటారు. అటు బాలు మీనా ఇద్దరు మాట్లాడుకోకుండా ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకోవడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది. ఒకరి పేరు ఒకరు చెప్పుకోకుండా మాట్లాడుకుంటారు కానీ బాలు మేన ఇద్దరు కూడా తమ మనసులో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న కూడా బయట పెట్టరు.. మొత్తానికి వీరిద్దరి మాటలు ఎపిసోడ్కి బాగా హైలైట్ అవుతాయి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..