Lucky Day : మన చుట్టు పక్కల ఉన్న వ్యక్తికి , తెలిసిన వారికి ఊహించని విధంగా ఏదైనా పెద్ద బహుమతి, లేదా ఉద్యోగమో , లాటరీ తగిలితే వస్తే అదృష్టవంతుడు అని అంటుంటాం. అలాంటి అదృష్టం అందరికీ రాదు. కొందరినే అదృష్ట దేవత పలుకరిస్తుంది. ఆ అదృష్టాన్ని సంకేతాలు కూడా ముందే వస్తాయి. అవి ఎలా గుర్తించాలో తెలుసా
నిద్రలేవగానే.. కొబ్బరికాయ లేదా తెల్లటి నీటి పక్షి కనిపించింది అంటే.. ఏదో ఒకవైపు నుంచి మీకు డబ్బు రాబోతోందని సంకేతం. మీ భూమిలో, స్థలంలో ఆవు గడ్డి తింటూ ఉంది అంటే.. కోపడ్డకండి. అది మీకు అదృష్టం వరిస్తుందని తెలిపే సంకేతం.తెలుపు లేదా గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే.. త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతం. ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణించాలని భావిస్తున్నప్పుడు, బయలుదేరిన తర్వాత కోతి, కుక్క, పాము, పక్షి.. ఏదైనా మీ వాహనానికి కుడివైపుగా ఉంది అంటే.. మీరు త్వరలోనే ధనవంతులవుతారని సంకేతం.
మనం బయటకు వెళ్లినప్పుడు పక్షి రెట్ట వేస్తే, చాలా చిరాకు పడతాం. ఐతే అది అదృష్టానికి సంకేతం అని గుర్తించాలి. దానికి కారణం అందరిపైనా పక్షులు రెట్టలు వేయవు ఎవరైతే.. చాలా అదృష్టవంతులు గా ఉంటారో వాళ్ళ మీద మాత్రమే అలా చేస్తాయి.కొన్ని సందర్భాల్లో హడావుడిలో బట్టలు వేసుకుంటూ రివర్స్ లో లోపలిది పైకి, పైది లోపలికి వేసుకుంటుంటాం. ఒక వేళా అలా జరిగితే చాలా గిల్టీగా ఫీలవుతాం. అయితే అది చాలా అదృష్టం. ఎక్కడైనా కాయిన్ కానీ గుర్రపు నాడా కానీ దొరికితే అది అదృష్టానికి , శ్రేయస్సుకి సంకేతంగా భావించండి. అలా దొరికిన వాటిని వాడకుండా లాకర్ లో పెట్టుకోవడం వల్ల త్వరలోనే చాలా మంచి ఫలితాలు పొందుతారు.
కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి స్థావరం కోసం వెదుక్కుంటూ ఉంటే అది సంతోషం, అదృష్టానికి సంకేతం గా భావించాలి. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన అని గుర్తు పెట్టుకోవాలి. కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే.. వాటిని బయటకు తరిమేయకండి. అవి మంచి, అదృష్టం రాబోతుంది అని సూచిస్తాయి. ఎప్పుడైనా, వర్షం ,ఎండా ఈ రెండింటినీ చూశారా ? ఇది చాలా తక్కువగా జరిగే సంఘటన. కానీ ఇది అదృష్టం, భాగ్యానికి సంకేతం అని మరువకండి.