Big Stories

Raw Papaya : పచ్చి బొప్పాయి తింటే ఏమవుతుంది?

Raw Papaya : సాధారణంగా బొప్పాయి పండ్లను పండిన తర్వాత తింటాం కానీ పచ్చి బొప్పాయి అని తింటే కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బొప్పాయిలో రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను పెంచే గుణం ఉంటుంది, డెంగ్యూ వచ్చినప్పుడు బొప్పాయి ఆకులను రసం తీసి ఇస్తే వెంటనే ప్లేట్‌లెట్స్‌ పెరుగుతాయి. అంతేకాకుండా బొప్పాయి మన చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బొప్పాయి పండ్ల కంటే ఎక్కువ పోషకాలు, ఎంజైమ్‌లు పచ్చి బొప్పాయిల్లో ఉంటాయని చెబుతున్నారు. పచ్చి బొప్పాయిలో ఉండే లేటెక్స్ ఫ్లూయిడ్ వల్ల అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీంతో చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలా ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే పచ్చి బొప్పాయిలను తినడం మానేయాలి. గర్భిణీలు కూడా పచ్చి బొప్పాయిలను తినకూడదు. పచ్చి బొప్పాయిల పైభాగం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. లోపలి భాగం తెలుపు రంగులో ఉంటుంది. దీంతో తినేందుకు కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఉడకబెట్టుకుని తింటే బాగుంటుంది. లేదా వెజిటేబుల్ సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. ఈ పచ్చి బొప్పాయిలను తినడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. పచ్చి బొప్పాయిల్లో పండిన వాటికంటే ఎక్కువగా ఎంజైములు ఉంటాయి. ముఖ్యంగా పపిన్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. మన జీర్ణ క్రియ కూడా బాగా మెరుగుపడుతుంది. పచ్చి బొప్పాయిలలో విటమిన్ ఏ, సి, ఈ లు అధికంగా ఉంటాయి. దీంతో మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News