BigTV English

Mahabharatam : కౌండిన్య ముని సంచరించే ప్రాంతం..

Mahabharatam : కౌండిన్య ముని సంచరించే ప్రాంతం..

Mahabharatam : కర్నాటకలోని కురుడుమలోని శక్తి గణపతి 14 అడుగుల భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. ఆర్కియాలజీ నిపుణులు ఈ గుడి సుమారు 2000 ఏళ్ళ క్రితం నాటిదని చెబుతారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మించడం విశేషం. త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్య విఘ్నాలు తొలగించుకున్నారట., త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఈఆలయానికి వచ్చి స్వామిని సేవించాలని స్థల పురాణం. చెబుతోంది.బెంగళూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ముళబాగిలుకు దగ్గరలో ఈ ఆలయం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది.


కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతీ రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారు అని అక్కడ పెద్దలు చెబుతారు. అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శనం చేసుకుంటే ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పోగొడుతుంది. ఈ గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×