BigTV English

Mahesh Babu: మ‌రో చిన్నారి ప్రాణం కాపాడిన మ‌హేష్‌.. సాయం చేసిన ప్రొడ్యూస‌ర్‌

Mahesh Babu: మ‌రో చిన్నారి ప్రాణం కాపాడిన మ‌హేష్‌.. సాయం చేసిన ప్రొడ్యూస‌ర్‌

Mahesh Babu:సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమాలు, త‌న వ్యాపారాల‌తోనే కాదు.. సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందుంటారు. రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకుని వాటి అభివృద్ధికి ఆయ‌న త‌న వంతుగా పాటు ప‌డుతున్నారు. అలాగే మ‌రో వైపు మ‌హేష్ బాబు ఫౌండేష‌న్‌ను స్టార్ట్ చేసి ఆంధ్రా హాస్పిట‌ల్స్‌, రెయిన్ బో హాస్పిటల్స్ వారితో క‌లిసి గుండె స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే చిన్నారుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. ఇప్ప‌టికే వెయ్యి మంది పిల్ల‌ల‌కు పైగా గుండె ఆప‌రేష‌న్స్‌ను చేయించారు. తాజాగా మ‌రో చిన్నారి ప్రాణం కూడా కాపాడారు. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ నిర్మాత నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ తెలిపారు.


అస‌లు ఇంత‌కీ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ప‌ర్టికుల‌ర్‌గా ఈ విషయాన్ని ఎందుకు చెప్పార‌నే డౌట్ రావ‌చ్చు. అస‌లు విష‌యం ఏంటంటే.. సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి తెలిసిన స్నేహితుడొక‌రు ఓ రోజు ఫోన్ చేసి ఓ పేద కుటుంబంలో చిన్న పాప గుండె స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంద‌ని, ఆ పాప‌కు గుండె ఆప‌రేష‌న్ చేయించ‌టానికి మ‌హేష్ బాబు ఫౌండేష‌న్‌ను ఎలా కాంటాక్ట్ కావాలో చెప్పాలంటూ రిక్వెస్ చేశార‌ట‌. దాంతో ఆయ‌నే స్వ‌యంగా న‌మ‌త్రా శిరోద్క‌ర్‌కి ఫోన్ చేసి విష‌యం చెప్పి హెల్ప్ కావాల‌ని అడిగార‌ట‌.

ఆయ‌న ఫోన్ చేసిన కొన్ని గంట‌ల్లోనే ఎవ‌రికీ సాయం కావాలంటూ మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ నుంచి నాగ‌వంశీకి ఫోన్ వ‌చ్చింది. ఆయ‌న వారి నెంబ‌ర్ ఇవ్వ‌టంతో ఫౌండేష‌న్ వాళ్లే ఎవ‌రైతే త‌మ చిన్నారి గుండె ఆప‌రేష‌న్ కోసం ఎదురు చూన్తున్నారో వారికి ఫోన్ చేసి వివ‌రాల‌ను తీసుకున్నార‌ట‌. కొన్నాళ్ల‌కు పాప క్షేమంగా ఉంద‌ని, ఆప‌రేష‌న్ జ‌రిగింద‌ని, మ‌హేష్ బాబుకి, న‌మ్ర‌త‌కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌ని చిన్నారి త‌ల్లిదండ్రులు ఎమోష‌న‌ల్‌గా నాగ‌వంశీకి మెసేజ్ పెట్టారు. ఆయ‌న ఆ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. మ‌హేష్ మంచి మ‌న‌సుని, చొర‌వ తీసుకుని చిన్నారి అండ‌గా నిల‌బ‌డిన నాగ‌వంశీని నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు.


Akkineni: అక్కినేని ఫ్యామ‌లీ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌!

Namrata Shirodkar:కొత్త హోట‌ల్‌ను ప్రారంభించిన న‌మ్ర‌త‌

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×