E-Paper
Advertisement

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ

Ernie: చాట్‌జీపీటీకి బైదూ చెక్.. పోటీగా ఎర్నీ
Advertisement

Ernie: చాట్‌జీపీటీ.. టెక్ రంగంలో ఇదొక సంచలనం. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. మార్కెట్లోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీతో మనుషుల పనులు మరింత సులభం అయిపోయాయి. ఏది కావాలన్నా క్షణాల్లో మన కళ్ల ముందు ఉంచుతుంది. ఏదైనా టాపిక్ చెబితే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్షణాల్లో మనకు అందిస్తుంది. అంతేకాకుండా దాన్ని మనకు నచ్చిన భాషలోకి కూడా మార్చుకోవచ్చు.

దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే చాట్‌జీపీటీ వల్ల నష్టాలు కూడా లేకపోలేదు. మనుషుల పనులు సలభతరం చేయడంతో ఇద్దరు చేయాల్సిన పనిని ఇక నుంచి ఒక్కరే చేయవచ్చు. ఈక్రమంలో మరొకరు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది.

Advertisement

ఇక చాట్‌జీపీటీని ఎదుర్కోవడానికి దిగ్గజ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే చాట్‌జీపీటీకి పోటీగా టెక్ దిగ్గజం గూగుల్ బార్డ్ పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఆధారిత చాట్‌‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా చైనాకు చెందిన దిగ్గజ సెర్చ్ ఇంజన్ బైదూ కూడా చాట్‌జీపీటీకీ పోటీగా చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌బాట్‌ ఎర్నీని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. మార్చి నుంచి ఎర్నీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

Tags

Related News

మేం ఆర్టిస్టులం కాదా.. తినడానికి కూడా టైమ్ ఇవ్వరా? శ్రీముఖి పై హరి ఫైర్

మన సంస్కృతికి ప్రతిరూపం రామాయణ.. అల్లు అర్జున్ పోస్ట్ తో భారీ హైప్!

Illu Illalu Pillalu Today Episodes: నిజం చెప్పేసిన చందు.. వల్లికి అన్యాయం.. భాగ్యం సవాల్..

Brahmamudi Serial Today Episode November 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విష్ చేసిన రాజు 

మమిత ఇంత షాక్ ఇచ్చిందేంటి..? అదంతా నిజం కాదా..?

Monday TV Movies : మండే మూవీ మస్తీ.. డోంట్ మిస్…

Brahmamudi Serial Today Episode October 30th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ ,ఇందుకు వేరే వాడితో పెళ్లి చేస్తుందా..?  

Intinti Ramayanam Pallavi : ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్న పల్లవి.. బాబోయ్..

Big Stories

Advertisement
×