Big Stories

Metaverse : సైన్స్ రూపురేఖలను మార్చే సత్తా ఉన్న మెటావర్స్..

Metaverse : సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనుషులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది. పిల్లల నుండి పెద్దలవరకు అందరూ ఈ కొత్త ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. అలాంటి వాటిలో మెటావర్స్ ఒకటి. ఫేస్‌బుక్ అనేది ఈ మెటావర్స్‌ను కనిపెట్టి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది. రోజురోజుకీ దీని క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. అయితే సైన్స్‌ను డెవలప్ చేసే విషయంలో మెటావర్స్ అనేది శాస్త్రవేత్తలకు తోడుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

డిజిటల్ స్పేస్‌కు కొత్త హంగులు దిద్దింది మెటావర్స్. బయట ప్రపంచంలో చేయలేని ఎన్నో పనులను చేయడం కోసం, ఎన్నో కొత్త అనుభవాలను పొందడం కోసం చాలామంది ఈ మెటావర్స్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ మెటావర్స్‌ను ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్‌గా పరిగణిస్తారు. కానీ కొంతమంది మాత్రం మెటావర్స్ అనేది అనవసరమైన టెక్నాలజీ అని, ఇది మనుషులకు అసలు అవసరం లేదని వాదిస్తున్నారు. దీనిని అవసరం లేదు అనుకునేవారి కంటే ఇది బెటర్ సైన్స్‌కు ఉపయోగపడుతుంది అని నమ్మేవారే ఎక్కువ అని నిపుణులు చెప్తున్నారు.

- Advertisement -

వర్చువల్ రియాలిటీ అనేది చూడడానికి అందంగా ఉన్నా కూడా దాని వల్ల ఉండే నష్టాల గురించి కూడా ముందే మాట్లాడడం మేలు అని నిపుణులు బయటపెట్టారు. బయట ప్రపంచం అనేది ఎలా ఉందో తెలుసుకోవడానికి వర్చువల్ రియాలిటీ అనేది ఒక ఉదాహరణలాగా ఉపయోగించే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. ముఖ్యంగా మెటావర్స్ వల్ల మనుషులకు నాలుగు రకాలుగా లాభాలు ఉన్నాయని నిపుణుల చర్చల్లో తేలింది. ఈ ప్రయోజనాల గురించి తెలిస్తేనే తర్వాత దాని వల్ల జరిగే నష్టాల గురించి తెలుస్తుందని వారు భావిస్తున్నారు.

ముందుగా వర్చువల్ రియాలిటీ అనేది సైన్స్ మధ్య అడ్డుగోడలను తొలగిస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ల్యాబ్‌ను తయారు చేసే ముందు అది ఎలా ఉంటుందని వర్చువల్ రియాలిటీలో పరీక్షించడం వల్ల ఏవైనా మార్పులను సులభంగా చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. మెటావర్స్ అనేది ఎన్నో కొత్త విషయాలనే నేర్చుకోవడానికి మాత్రమే కాదు నేర్పించడానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. చిన్నపిల్లలకు మాత్రమే కాదు పెద్దవాళ్లకు కూడా ఏదైనా విషయాన్ని ఇంట్రెస్టింగ్‌గా నేర్పించాలంటే మెటావర్స్ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం మెటావర్స్‌ను అందరూ ఉపయోగించడానికి అడ్డంగా ఉంటుంది దాని కాస్ట్. వర్చువల్ రియాలిటీలో ప్రవేశించానికి ఉపయోగపడే కళ్లద్దాలు చాలా కాస్ట్ ఉండడంతో ఇది అందరికీ అందుబాటులో ఉండడం కష్టంగా మారింది. అంతే కాకుండా మెటావర్స్‌లో ప్రైవసీ విషయాన్ని కూడా మేకర్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ప్రస్తుతం మెటావర్స్‌లో ప్రైవసీ అనేది చాలా తక్కువగా నిపుణులు భావిస్తున్నారు. అన్ని టెక్నాలజీల విధంగానే మెటావర్స్‌కు కూడా చాలామంది అలవాటు పడతారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News