 
					SBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పలు ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ లేదా ఎంబీఏ, పీజీడీఎం లేదా పీసీ డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం, అప్లికేషన్ ఫీజు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 103 స్పెషలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 27న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 17న దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఏదైనా డిగ్రీ బీఈ, బీకామ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా పాసై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 అక్టోబర్ 27
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 17
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి ప్రారంభ వేతనమే రూ.20 లక్షల వరకు ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.
పోస్టులు – వెకెన్సీలు:
హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్ మెంట్ అండ్ రీసెర్చ్): 1 పోస్టు
జోనల్ హెడ్ (రీటైల్) : 4 పోస్టులు
రీజనల్ హెడ్ (రీటైల్) : 7 పోస్టులు
రీలెషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 19 పోస్టులు
ఇన్వెస్ట్ మెంట్ స్పెషలిస్ట్ (ఐఎస్) : 22 పోస్టులు
ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్: 46 పోస్టులు
ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ మేనేజర్: 2 పోస్టులు
సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్): 2 పోస్టులు
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు 25 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.bank.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి లక్షల్లో వేతనాలు ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 103
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 17
ALSO READ: Telangana: తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10 వేలు సాయం