BigTV English

Mopidevi Temple : ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం, సంతాన యోగం..!

Mopidevi Temple : ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం, సంతాన యోగం..!

Mopidevi Temple : ప్రస్తుత కాలంలో చాలా మంది యువత పెళ్లి కాక చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం.. కొంతమంది నాగదోషం అంటే మరి కొందరు కుజదోషం అంటారు. కానీ మోపిదేవి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శిస్తే వివాహ సంబంధ దోషాలు తొలగిపోతాయని స్కాందపురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉంది.


శివ భగవానుడిని భర్తగా పొందేందుకు పార్వతిదేవి తపస్సు ప్రారంభించిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే పార్వతిదేవి ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక పార్వతీదేవి ఆగ్రహంతో ఊగిపోతుంది.

ఆ సమయంలో ప్రత్యక్షమైన అగస్త్య మహాముని కొన్ని దోషాల కారణంగా శివుడు ప్రసన్నం కాలేదంటూ.. ఉపచార మార్గాలను సూచించాడు. వింధ్య పర్వతంపై పాము ఆకారంలో వివాహవదేవుడు ఉంటాడు. అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని మరల తపస్సు చేయమని చెప్తాడు.


పార్వతిదేవి వింధ్య పర్వతంలోని స్వామి వద్దకు వెళ్లగానే అక్కడ పాము ఆకారంలో ఉన్న సుబ్రమణ్య స్వామి అమ్మవారి కోర్కెను తెలుసుకొని శివభగవానుడికి తెలియజేశాడని కాల క్రమేణ మీ పుణ్య దంపతులకు కుమారుడు జన్మిస్తాడని ప్రార్థించాడని ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొనబడింది.

ఈ నాటి మోపిదేవి సుబ్రమణ్యేశ్వర ఆలయమే.. ఆ నాటి వింధ్య పర్వతం. దక్షిణ భారత దేశంలోని షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు స్కాందపురాణంలో పేర్కొన్నారు. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. స్కాంద పురాణంలోని సింహాద్రి ఖండంలో మోపిదేవి ఆలయ మహిమళ గురించి పేర్కొన్నారు.

వింధ్యుడి గర్వమణచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో అగస్త్య మహర్షి వారణాసిని వదిలి పెట్టాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు. దారిలోని వింధ్యపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు అగస్త్యుడు తాను మళ్లీ తిరిగొచ్చే వరకు అలానే ఉండాలని శాసిస్తాడు. అనంతరం పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పునీతం చేసి ఆ దంపతులు కృష్ణా నది తీరంలో అడుగుపెట్టారు.

దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి పుట్టలను చూస్తూ.. ముందుకు వెళుతుండగా లోపాముద్ర దేవి, శిష్యగణం ఆయనను అనుసరించారు. అక్కడున్న ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్య తేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రమణ్య క్షేత్రమని శిష్యులకు వివరించాడు. కుమారస్వామినే సుబ్రమణ్యుడి పేరుతో పిలుస్తారని శిష్యుల సందేహాన్ని నివృత్తి చేశాడు.

అగస్త్య, సనత్కుమారులు ఎప్పుడూ ఐదేళ్ల ప్రాయం వారిగానే.. దిగంబురులై భగవదారధనలో ఉంటారు. వీరు ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా.. పార్వతి, కుమారస్వామి మాత్రమే దర్శనిమిచ్చారు. అదే సమయంలో సరస్వతి, లక్ష్మీ, శచీతో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరీమణులను చూసిన కుమార స్వామికి నవ్వు ఆగలేదు.

దీన్నీ గమనించిన పార్వతి.. కుమార ఎందుకు అలా నవ్వుతున్నారు.. వారు నాలా కనపించడం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా బేధం ఉందా? అని ప్రశ్నించింది. తల్లి మాటలకు పశ్చాతాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ కోరాడు.

ఈ ప్రాంతానికి చేరుకొని ఉరగరూపంలో పుట్టలో తపస్సు ప్రారంభించాడు. ఆ ప్రాంతమే ఇదని అగస్త్యుడు శిష్యులకు చెప్పి.. పుట్టపై శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఆ ప్రదేశానికి సమీపాన వీరరావు పర్వతాలు అనే కమ్మరి ఉండేవాడు. శివుడి అతడి కలలో కనిపించి.. తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్టించమని కోరాడు. వీరరావు మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని మట్టితో తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు.

ఈ క్షేత్రాన్ని మోహినీపురంగా పిలిచేవారు. కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడింది. గర్భగుడిలోని పాము చుట్టలే పానవట్టం. వీటిపైనే శివలింగం ఉంటుంది. పానవట్టం క్రింద ఉండే రంధ్రాల్లోనే పాలు పోస్తారు. సంతానం లేని వారు, శారీరక సమస్యలు, శ్రవణ దోషాలతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వివాహం కానీ యువతీ, యువకులు ఇక్కడ పూజలు చేయించుకుంటే దోషాలు పోతాయి.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×