Intinti Ramayanam Today Episode September 30 th : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనీవల్ల అక్షయ్ జాబ్ మానేసిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే తన భర్తని బిజినెస్ లోకి దించాలని అవని కంకణం కట్టుకుంటుంది. తను అనుకున్న విధంగా ఇంటిని తాకట్టు పెట్టి అక్షయకి బిజినెస్ పెట్టడానికి సాయపడాలని అనుకుంటుంది. ఈ విషయాన్ని రాజేంద్రప్రసాద్ తో చెప్పడంతో ఆయన సరే అనడంతో అందరి ముందర అక్షయ్ కి పెట్టుబడి పెట్టడానికి డబ్బులు సాయం చేస్తానని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆ మాట వినగానే శ్రీయా మా భర్తలకి ఎందుకు ఇవ్వరు అంటూ ఒంటి కాల మీద లేస్తుంది. అవని తన భర్త చేత అనుకున్నట్లుగానే బిజినెస్ ని స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ బిజినెస్ చేసుకోవడానికి లోన్ తీసుకొచ్చినట్లు రాజేంద్రప్రసాద్ అందరితో చెప్తాడు. అయితే ఆ మాట వినగానే అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు కానీ శ్రియ మాత్రం మీకు బావగారు ఒక్కరే కొడుకా మిగతా ఇద్దరు కొడుకులు కి కూడా మీరు సమానంగా డబ్బులు ఇవ్వాలి కదా అని అడుగుతుంది. మీరు ఒకలాగా కొడుకుని ఒకలాగా మిగతా ఇద్దరి కొడుకుల్ని ఒకలాగా చూస్తున్నారు అని కడిగి పడేస్తుంది. అవని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడకు అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నావు అంటూ శ్రీయ అంటుంది.
రాజేంద్రప్రసాద్ ఎవరికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు. కానీ శ్రియ మాత్రం అత్తయ్య మీకు బావగారు సొంత కొడుకు కాదు అని చెప్పారు కదా.. అలాంటిది అతని మీద మీరు ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? మిగతా ఇద్దరు కొడుకుల్ని ఎందుకు సరిగ్గా చూసుకోవడం లేదు అని అడుగుతుంది. ఆమె కన్నతల్లి కాకపోవచ్చు నేను కన్న తండ్రిని ఇదంతా నా కష్టార్జితం నా ఇష్టం వచ్చినట్లు చేసుకొని హక్కు నాకుంది మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక శ్రీయా, శ్రీకర్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇక పల్లవి భరత్ ని తీసుకొని చక్రధర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకు కావలసిన విధంగా లోన్ కోసం అమౌంట్ నేను ఇస్తాను అని చక్రధర్ అంటాడు. భరత్ ని ఇంకాస్త రెచ్చగొట్టి అవనిపై అసహ్యం పుట్టేలా మాట్లాడుతుంది పల్లవి. ఇక మొత్తానికి తన అనుకున్న పనిని పూర్తి చేస్తుంది. భరత్ ని మాటల్లో పెట్టేసి సంతకాలు చేయించేస్తుంది పల్లవి.. వాళ్లు నిజంగానే మంచి వాళ్ళని నమ్ముతాడు భరత్. చక్రధర్ అన్న మాటల్ని నిజమే అని నమ్ముతాడు భరత్. మా పేర్ల గురించి ఏంటి పరిస్థితులను బయట పెట్టొద్దు అని చక్రధర్ మాట తీసుకుంటాడు.
అవని మావయ్య గారు మీకు గుర్తుంది కదా ఈ డబ్బులు నేను తీసుకొచ్చినట్లు ఆయనకు తెలియకూడదు. తెలిస్తే ఆయన కచ్చితంగా తీసుకోడు అని అంటుంది అవని. రాజేంద్రప్రసాద్ అందరినీ పిలుస్తాడు. అక్షయ్ ని పిలిచి ఇదిగోరా నీకు ఇస్తానన్న 50 లక్షలు.. వీటిని తీసుకొని మంచి బిజినెస్ స్టార్ట్ చేయు అని డబ్బులు ఇస్తాడు. ఈ డబ్బులు నీ ముందు లోపల పెట్టు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే శ్రీయా మాత్రం మీరేం చేసినా అడిగే హక్కు మాకు లేదని అంటున్నారు ఆ మావయ్య అని మళ్ళీ రచ్చ చేస్తుంది.
Also Read : రోహిణి నిజ స్వరూపం బయటపడుతుందా..? మీనాను లాక్ చేసిన విద్య.. బాలుకు అనుమానం..
అక్షయ్ ని కూడా శ్రీయా అడుగుతుంది.. ఏం జరిగినా సరే అక్షయ్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అవని ఆ డబ్బులని అరేంజ్ చేసిన విషయం పల్లవికి తెలిసిపోతుంది. ఆ తర్వాత భరత్ డబ్బులు తీసుకురావడం చూసి కమల్ షాక్ అవుతాడు. పల్లవి భరత్ ఎక్కడ దొరికిపోతాడు తాను ఎక్కడ అడ్డంగా ఇరుక్కుంటుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో పల్లవి బండారం బయటపడుతుందా? అవని డబ్బులు ఇచ్చిందని అక్షయ్ వెనక్కి ఇచ్చేస్తాడా? ఏం జరుగుతుందో తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..