Gundeninda GudiGantalu Today episode September 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి తన కన్న కొడుకుకి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకొని హాస్పిటల్ కి వెళుతుంది. అక్కడ ఉన్న మీనా బాలు దగ్గరనుంచి ఎలాగోలాగా తప్పించుకొని బయటపడుతుంది. చివరికి రోహిణి ఊహించని విధంగా తన తల్లి తన కొడుకు తన ఇంటికి రావడం చూసి షాక్ అవుతుంది. వీళ్లు ఇక్కడే ఉంటే నా బండారం బయటపడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఎలాగైనా సరే తన తల్లిని పంపించాలని ప్లాన్ చేస్తుంది రోహిణి. తన ప్లాన్ ప్రకారం ఇంట్లోని వాళ్ళందరినీ ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తుంది. మరి రోహిణి బండారం బయట పడుతుందా? బాలు కి అసలు నిజం తెలిసి పోతుందా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రోహిణి తన తల్లితో మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని సీరియస్ గా మాట్లాడుతుంది. దానికి సుగుణమ్మ కూడా నీ కొడుకు అని నువ్వు చెప్పుకోలేని స్థితిలో ఉన్నావు అదేనా నువ్వు చేసే పని అని సీరియస్ అవుతుంది. నా పరిస్థితిని అర్థం చేసుకో అమ్మ నా కాపురం కూలిపోతుంది నువ్వు ఇక్కడే ఉంటే అని బ్రతిమలాడుతుంది రోహిణి. అప్పుడే చింటూ కిందకు వస్తాడు. పడిపోతుంటే రోహిణి పట్టుకొని నేను మీ అత్తను కాదురా అమ్మని అని దగ్గరకు తీసుకుంటుంది. నువ్వు మా అమ్మవని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పమ్మా అని చింటూ అడుగుతాడు.
రోహిణి నేను మీ అమ్మనున్న సంగతి ఎక్కడ చెప్పద్దు అని మాట తీసుకుంటుంది. చింటూ ఎంతగా బ్రతిమలాడుతున్న సరే మరి కొద్ది రోజుల్లో వస్తాను అని ఏదో ఒకటి సర్ది చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించాలని రోహిణి చూస్తుంది. విద్య మీనా చేత వంట కూడా చేయించి మనిద్దరం కలిసి తిందామని అడుగుతుంది. ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ప్రభావతిపై సెటైర్లు వేసుకుంటూ భోజనం చేస్తారు. అటు బాలు ట్రిప్ బుక్ చేశారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఇంటికి రిటర్న్ వచ్చేస్తాడు.
బాలు చింటూని వెతుక్కుంటూ పైకి వస్తాడు. ఏంటి మీరిద్దరూ ఇలా ఒంటరిగా కూర్చున్నారేంటి ఎవరూ పట్టించుకోవట్లేదని అడుగుతుంది. అదేం లేదు బాబు చింటూ ఇప్పుడే నిద్ర లేచాడు అందుకే ఇక్కడే కూర్చొని ఉన్నామని సుగుణమ్మ అంటుంది. చింటూ నువ్వు ఎందుకు ఇంత డల్ గా కూర్చున్నావు.. ఇదిగో అమ్మ చింటూ కోసం బిర్యానీ తీసుకొని వచ్చాను. వాడికి పెట్టండమ్మా నేను వెళ్లి మొహం కడుక్కొని వస్తానని బాలు వెళ్లిపోతాడు. ఇక రోహిణి చింటూ కి ప్రేమగా బిర్యానీ వడ్డిస్తుంది.
చింటూ నేను అమ్మతోనే ఉంటాను కదా అని అంటాడు. దానికి రోహిణి అరే నన్ను అమ్మా అని పిలవద్దు రా ఇంట్లో ఆ యముడు ఉన్నాడు దొరికానంటే నన్ను ఆడుకుంటాడు అని అంటుంది. చింటూ బలవంతం మీద రోహిణి వాడికి తినిపించడానికి ఒప్పుకుంటుంది. ఆ సీన్ చూసిన బాలు పార్లరమ్మ అమ్మ అయ్యింది అని అంటాడు. లేదు బాబు కొత్తవాళ్లతో చింటూ బాగా కలిసిపోతాడు కదా అందుకే రోహిణి బుజ్జగించి అన్నం తినిపిస్తుంది. ఎప్పుడు మాకు రూమ్ ఇవ్వదు కానీ మీకు రూమ్ ఇచ్చింది. అందుకే నాకు అనుమానం వచ్చింది అంటే అని బాలు క్లారిటీ ఇస్తాడు.
ఏది ఏమైనా కూడా పార్లర్ అమ్మ నీకు ఇలా ఒక కొడుకు ఉంటే తినిపిస్తావు కదా ప్రేమ గాని బాలు వెళ్ళిపోతాడు. ఇక బాలు చింటూ ఆడుకుంటూ ఉండగా మీనా ఇంటికి వచ్చేస్తుంది. బాలు మీనా రాగానే ఇంటికి వచ్చేసావా నీకేం కాలేదుగా అంత జాగ్రత్తగానే ఉన్నావుగా అని అడుగుతాడు. నాకేమైంది నన్ను ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అని నేను అడుగుతుంది. పార్లరమ్మ ఫ్రెండ్ కదా నీకేమైనా అయ్యుంటుందని కంగారు పడిపోయాను అని బాలు అంటాడు.
రోహిణి తినిపించింది అని మీనా తో బాలు చెప్తాడు. రేపు ఎవరైనా అమ్మ కావాల్సిన వల్లే చిన్నపిల్లలు చూస్తే అలాగే మారతారు ఇందులో గొప్పేముంది అని మీనా అంటుంది. ఇవన్నీ ఎందుకమ్మా అని సుగుణమ్మ అడుగుతుంది. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటే సరదాగా ఉంటుంది కదమ్మా అందుకే కొన్ని ఇచ్చాను ఏం పర్లేదు అని మీనా అంటుంది. సుగుణమ్మ మొహం చూసి కళ్ళు ఎర్రగా ఉన్నాయని అనుమానం వస్తుంది మీనాకు.. చింటూ గురించిన మన బాధంతా అని ఆమె అంటుంది. రేపు చింటూ కళ్ళు ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని చూసి అమ్మమ్మ అనగానే ఆ బాధంతా పోతుంది అని మీనా అంటుంది.
Also Read: అయ్యో.. అడ్డంగా ఇరుక్కున్న ధీరజ్.. శ్రీవల్లి, నర్మద ఫైట్.. రామ రాజు షాకింగ్ నిర్ణయం..?
చింటూ మా అమ్మని కూడా చూస్తాను కదా అని అడుగుతాడు. అప్పుడే ఇంటికి రవి శృతి వస్తారు. మీరు వాళ్ళ అత్తకి కాల్ చేయండి అని మీనా చెప్తుంది. ఈ టైంలో తన దగ్గర తన ఫోను ఉండదు అమ్మ మళ్లీ చేసినప్పుడు నీ చేత మాట్లాడిస్తాను అని సుగుణమ్మ అంటుంది. రవి కావాలని రోహిణి పాలను కింద వేయడం చూసి షాక్ అవుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి రోహిణి బండారాన్ని బయటపెడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..