BigTV English

Sperm Count : రోజూ ఇలా చేస్తే.. మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Sperm Count : రోజూ ఇలా చేస్తే.. మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Sperm Count : మానవ పుట్టుకకు వీర్య కణాలే కారణం. వీర్య కణాలు స్త్రీ అండంతో కలిస్తే బిడ్డ జన్మిస్తుంది. కానీ నేటి జీవన విధానం మని శరీరంపై అనేక ప్రభావాలు చూపుతుంది. ప్రధానం పురుషుల వీర్య కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో సంతానోత్పత్తి ప్రతికూలంగా ఏర్పడి వైద్యుల వద్దకు వెళ్లి.. లక్షల్లో రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు మన పూర్వికులు పౌష్టికాహారంతో గంపెడుమంది పిల్లలకు జన్మనిచ్చారు. నేడు మాత్రం ఒక్కరిని కనడానికి నానాతంటాలు పడాల్సి వస్తుంది.


వీర్య కణాలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం. మద్యం, పొగతాగే అలవాటు. పొగాకు ఉత్పత్తుల్లో సుమారుగా 2 వేల రకాల రసాయనాలు ఉండటం వల్ల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మద్యం, ధూమపానం పురుషుల్లో పలు సమస్యలకు కారణం అవుతుంది.

వీర్య కణాలు సంఖ్య తగ్గడానికి ఊబకాయం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఊబకాయం వీర్య కణాల నాణ్యతను దెబ్బ తీస్తుంది. ప్రస్తుత కాలంలో ఊబకాయ సమస్యలు అధికమై పోతున్నాయి. ఇది సంతాన సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. వీర్య కణాల నాణ్యత పడిపోయేలా చేస్తుంది.


రోజుకు కనీసం 8 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి కూడా వీర్య కణాల సంఖ్య తగ్గేందుకు కారణం అవుతుంది. వీర్య కణాలు నాణ్యత పెరగడానికి నిద్ర ఉపయోగకరంగా ఉంటుంది.

తక్కువ వీర్యం ఉత్పత్తి రేటుతో బాధపడేవారు టమోటాలను రోజూ తినాలి. ఇందులో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది వీర్యం నాణ్యం, ఉత్పత్తిని పెంచుతుంది.

గుమ్మడికాయ గింజలను రోజూ తినడం వల్ల శరీరంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ల సరఫరా పెరుగుతుంది. ఇది పురుషుల జననేంద్రయాల్లో రక్తప్రసణ పుంచేందుకు దోహదపడుతుంది.

అరటిపండ్లలో విటమిన్ ఏ,సీ, బీ1 పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన వీర్యం ఉత్పత్తి అవుతుంది. అరటిలో బ్రోమెలైన్ అనే అరుదైన ఎంజైమ్ కూడా ఉంటుంది. ఇది వీర్యం కౌంట్‌ను పెంచుతుంది.

దానిమ్మ పండ్లను ఎక్కువగా తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది వీర్యం ఉత్పత్తిని పెంచుతుంది. పురుషులు లైంగిక ఆరోగ్యానికి దానిమ్మ మేలు చేస్తుంది.

వెల్లుల్లి పురుషులకు చాలా మంచిది. ఇది జననాంగాలలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా వీర్యం ఉత్పత్తి పెరుగుతుంది.

గుడ్లలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్యం ఉత్పత్తిని పెంచుతాయి. వీర్యం బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్రమం తప్పకుంగా గుడ్లు తింటే వీర్యం నాణ్యత పెరుగుతుంది.

వీర్య కణాల ఉత్పత్తిలో జింక్ మంచి పాత్ర పోషిస్తుంది. బార్లీ, బీన్స్, ఎర్రమాసంలో జింక్ పుష్కలంగా ఉంటుంది. జింక్ లోపం వల్ల వీర్యం చలనశీలత, సంతానోత్పత్తి తగ్గుతుంది. వీర్య కణాల సంఖ్య పెంచడానికి మీ ఆహారంలో జింక్ కచ్చితంగా ఉండాలి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×