BigTV English

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : అప్పు కట్టలేదని కన్నపిల్లల కళ్ళముందే ఘోరంగా… మనసును మెలిపెట్టే ఫీల్ గుడ్ స్టోరీ

OTT Movie : ‘మంచి చేస్తే మంచే జరుగుతుంది’ ఇది ఒక కొటేషన్ కాదు. దీని వెనుక చాలా పరమార్థం ఉంది. ఈ పదానికి సరైన అర్థం తెలుసుకోవాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా పై ఓ లుక్ వేయండి. ఈ కథ ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఒక అనే చిన్న పిల్లవాడు తన కుటుంబంలో ఉన్న ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని పోగొట్టుకుంటాడు. ఆతరువాత దాన్ని తిరిగి పొందేందుకు అతను చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న పిల్లలైనా పెద్ద బాధ్యతలు తీసుకోగలరని ఈ కథ కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘Erumbu’ 2023 జూన్ 16న థియేటర్లలో విడుదలైన తమిళ ఫీల్ గుడ్ సినిమా. దీనికి సురేష్ జి దర్శకత్వం వహించారు. ఇందులో చార్లీ, ఎం.ఎస్. భాస్కర్, జార్జ్ మరియన్, మోనికా సివ, శక్తి రిత్విక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 104 నిమిషాల రన్‌టైమ్‌తో, ఈ చిత్రం IMDbలో 7.4/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2023 ఆగస్టు 9 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీలోకి వెళ్తే

ఒక గ్రామంలో ముత్తు అనే చిన్న పిల్లాడు, తన ఇంట్లో ఒక ఉంగరాన్ని పొరపాటున పోగొట్టుకుంటాడు. ఈ ఉంగరం వాళ్ళ కుటుంబానికి చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఈ ఉంగరం కనిపించకుండా పోవడంతో ముత్తు చాలా భయపడతాడు. ఎందుకంటే అతని సవతి తల్లి కమలంకి చాలా కోపం ఉంటుంది. ఆమెకు తెలిస్తే ఇక అంతే సంగతి, తన పని ఐపోతుందని అనుకుంటాడు. అతను తన అక్క పచ్చయమ్మ, పక్కింటి చిట్టు సహాయంతో ఈ సమస్యను సీక్రెట్ గా సాల్వ్ చేయాలని అనుకుంటాడు.


ఈ సమయంలో వాళ్ళ తండ్రి అన్నాదురై, సవతి తల్లి కమలం డబ్బు సంపాదించడానికి కూలి పనికి పక్క ఊరు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక వ్యక్తికి అర్జెంట్ గా అప్పు కట్టాల్సి ఉంటుంది. ఈ లోపల ముత్తు, పచ్చయమ్మ, చిట్టు కలిసి డబ్బు సంపాదించడానికి చిన్న చిన్న పనులు చేస్తారు. కొబ్బరి బొండాలు అమ్మడం, కూరగాయలు ఏరడం లాంటివి ఇందులో ఉంటాయి. వీళ్ళు ఈ పనుల్లో చాలా కష్టపడతారు. కానీ ఊళ్లో ఉన్న కొందరు వాళ్ళని ఏడిపిస్తారు. అయితే చిట్టు వాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉంటాడు. చివరికి ముత్తు, పచ్చయమ్మ కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ ఉంగరం సమస్యను సాల్వ్ చేస్తారు. వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల ఊళ్లో కొందరు వాళ్ళకి సహాయం చేస్తారు. ఈ కథ ఒక మంచి ఫీల్‌తో ముగుస్తుంది.

Read Also : ఈ ఊళ్ళో నీళ్లలో అడుగుపెడితే పోతారు… తండ్రీకూతుర్లూ ఇద్దరూ ట్రాప్… వణుకు పుట్టించే ట్విస్టులు

Related News

OTT Movie : భర్త ఉండగానే భార్యపై అఘాయిత్యం… ఒక్కొక్కడినీ ముక్కలు ముక్కలుగా నరికి… ఈగోను సాటిస్ఫై చేసే రివేంజ్ భయ్యా

OTT Movie : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా

OTT Movie : భర్త చేతగానితనం… భార్యపై కన్నేసే మరిది… ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు

OTT Movie : పందుల పైశాచికం… మనుషుల్ని పీక్కుతినే విడ్డూరం… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు మావా

OTT Movie : అందం కోసం అరాచకం… మనిషి మాంసాన్ని మటన్ లా తినే ఊరు… మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మొగుడి వల్ల కావట్లేదని… హోటల్ గదిలో మరొక వ్యక్తితో… ఫ్యామిలీతో కలిసి చూడకూడని మూవీ భయ్యా

OTT Movie : గడ్డివాములో గందరగోళం… పిల్లాడికి హెల్ప్ చెయ్యడానికి వెళ్లి ట్రాప్… గూస్ బంప్స్ పక్కా

Big Stories

×