BigTV English

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Nindu Noorella Saavasam Serial Today Episode:  గాలి వీచిన చోట, చెట్లు కదులుతున్న చోట అరుంధతి ఆత్మ ఉంటుందని ఘెర చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న మనోహరి గేటు దగ్గర చెట్టు కదులుతుండటంతో అక్కడి వెళ్తుంది. అక్కడే అరుంధతి ఆత్మ ఉందని నిర్దారించుకున్న తర్వాత ఆరుకు వార్నింగ్‌ ఇస్తుంది మనోహరి. జీవితంలో చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో ఇచ్చావు నీవు అలాంటి నీకు నేను ఒక మంచి గిఫ్ట్‌ ఇద్దామనుకుంటున్నాను. చనిపోయి నువ్వు ఒంటరిదానివూ పోయావు కదా? అందుకుఏ నీ ఇంట్లో ఒకరిని నీకు తోడుగా పంపిస్తాను అని చెప్తుంది. దీంతో ఆరు షాక్‌ అవుతుంది. మనోహరి అంటూ గట్టిగా అరుస్తుంది. నువ్వేదో మాట్లాడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. కానీ వినిపించడం లేదు ఆరు. అయినా సరే గుర్తు పెట్టుకో ఇంట్లో వాళ్లు  అమర్‌ తప్పా ఎవరినైనా ఒకరిని నీకు తోడుగా పంపిస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది మనోహరి.


మనోహరి తన రూంలో కి వెళ్లగానే మిస్సమ్మ కిందకు వస్తుంది. గార్డెన్‌ లో ఉన్న ఆరును చూసి అక్కడికి వెళ్తుంది. తన రూంలోంచి బయటకు వచ్చిన మనోహరి, ఇది కచ్చితంగా ఆరుతో మాట్లాడుతుంది. ఇది మాట్లాడింది అంటే నేను చెప్పిన మాటలు ఆరు విన్నదని అనుకోవాలి అని డోర్‌ దగ్గర నిలబడి చూస్తుంది. గార్డెన్‌ లోకి వెళ్లిన మిస్సమ్మ.. ఆరును పలకరిస్తుంది. ఎందుకు అలా ఉన్నావని అడుగుతుంది.  ఏంలేదు మిస్సమ్మ అయినా నువ్వేదో అడుగుతున్నావు కదా అడుగు అని ఆరు చెప్పగానే సరే అడుగుతాను అని మిస్సమ్మ అంటుంది.

ఇదంతా గమనిస్తున్న మనోహరి ఆరు అక్కడే ఉంది అంటే నేను చెప్పింది కూడా విన్నది. అనుకుంటూ ఆరు ఇక చూడు నీకు తెలియకుండా నీతో ఎలా ఆడుకుంటానో అనుకుని లోపలికి వెళ్లిపోతుంది మనోహరి. ఇంతలో భాగీ ఏంటక్కా నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ చూస్తున్నావు అంటుంది. నేను చెప్పేది విను అక్కా అంటూ పౌర్ణమి రాబోతుంది కదా? ఇలాంటి ఒక పౌర్ణమి నాడే ఏదో ఒక శక్తి నన్ను ఆవహించి ఆయన పక్కన పీటల మీద కూర్చునేలా చేసింది అక్కా.. అంటూ మిస్సమ్మ చెప్తుంది.


ఏదో ఒక శక్తి కాదు బాలిక. దుష్టశక్తి అది ఈ శక్తే.. అంటూ గుప్త, ఆరును చూపిస్తాడు. మిస్సమ్మ మాత్రం మళ్లీ పౌర్ణమి వస్తుంది కదా? ఈసారి కూడా ఆ శక్తి నాలోకి వచ్చి ఆయన దగ్గరకు వెళ్లి ఆరోజు పెళ్లి పీటల మీద కూర్చోవడానికి నాకు ఏ సంబంధం లేదని చెప్తే నా లైన్‌ క్లియర్‌ అయిపోతుంది అక్కా. అనగానే అయ్యో అయ్యయ్యో.. సమస్య సృష్టించిన వారినే సమాధానం అడుగుతున్నది. పిచ్చి బాలిక అంటాడు గుప్త. దీంఓ ఆరు కోపంగా గుప్త గారు మీరు ఆగుతారా? అంటుంది. దీంతో మిస్సమ్మ  ఎవరితో  మాట్లాడుతున్నావు  అక్కా అంటూ ఆరును అడుగుతుంది.

దీంతో షాక్‌ అయిన ఆరు. నాలోనే ఉన్న  నాతోనే నేను మాట్లాడుకుంటున్నాను అంటుంది. దీంతో కన్పీజ్‌ గా మిస్సమ్మ  అక్కా నా లైన్‌ క్లియర్‌ అయిపోతే మేము కూడా అందరి భార్యాభర్తల్లా.. పాలు నీళ్లలా, పప్పులో ఉప్పులా.. మనోహరి, కుళ్లులా కలిసే ఉంటాం అని చెప్తుంది. దీంతో ఆరు తల పట్టుకుని హతవిధి అంటుంది. మిస్సమ్మ ఏంటక్కా ఏమో అంటున్నారు? అని అడగ్గానే నేనా నేను ఏమీ అనలేదు మిస్సమ్మ.. అనలేను, అనకూడదు.. ఏమీ అననులే అంటూ కన్ఫీజ్ గా మట్లాడుతుంది ఆరు. దీంతో మిస్సమ్మ ఎందుకు అనలేరు అక్కా.. చెప్పండి మీరు ఎందుకు అనకూడదు అంటూ వితండవాదం చేస్తుంది. అయినా ఇవన్నీ నాకెందుకులే నా కష్టమేదో నేను పడతాను.. నా సమస్యకు పరిష్కారం నేనే కనుక్కుంటాను అనుకుంటూ లోపలికి వెళ్తుంది మిస్సమ్మ.

హాల్లో అంజు, అమ్ము చెస్‌ ఆడుతుంటారు. చెస్‌ ఓడిపోయే పరిస్థితి వచ్చేసరికి అంజు ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. దీంతో భయపడిపోయావా అంజు అంటూ అమ్ము వెటకారంగా మాట్లాడుతుంది. భయం అంటే ఏంటని అడుగుతుంది అంజు. ఇంతలో  భాగీ వచ్చి నీ ప్రొగ్రెస్‌ రిపోర్టు మీ డాడీ చేతిలో ఉన్నప్పుడు నీకు ఉంటుంది చూడు దాన్నే భయం అంటారు. అనగానే అంజు మిస్సమ్మకు తిడుతుంది. నిన్ను డిస్టెంన్స్‌ గా ఉండమని చెప్పాను అంటుంది. తర్వాత అంజు చెక్‌ చెప్పడంతో అమ్ముతో పాటు పిల్లలు కూడా బాధపడతారు. మూడు నెలల ప్యాకెట్‌ మనీ లాస్‌ అయ్యామని ఫీలవుతారు.

అంజు మాత్రం ప్రంపంచం గెలిచినట్లు ఫోజులు కొడుతుంది. ఈ ఇంట్లో నన్ను ఎవ్వరూ ఓడించలేరు అంటుంది. ఇంతలో మిస్సమ్మను నేను నిన్ను ఓడిస్తాను అంటుంది. దీంతో ప్రపంచ జ్ఞానం లేని నీతో నేను ఆడలేనని అంజు తప్పేకుంటుంది. ఇంతలో లోపలి నుంచి మనోహరి వచ్చి మిస్సమ్మతో నేను ఆడతానని కూర్చుంటుంది. మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ కాంపీటిషన్‌ హోరాహోరీగా సాగుతుంటుంది.

ఇంతలో మనోహరి, మిస్సమ్మకు చెక్‌ చెప్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన అమర్‌ మిస్సమ్మ సైడ్‌ మంత్రిని కదిపి మనోహరికి చెక్‌ చెప్తాడు. మనోహరి ఓడిపోతుంది. తర్వాత మనోహరిని తనతో పర్సనల్‌ గా మట్లాడాలని లోపలి రమ్మని అమర్‌ పిలవగానే మనోహరి భయంగా లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ అంత పర్సనల్‌ ఏంటబ్బా అని ఆలోచిస్తుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×