BigTV English

Job Layoffs Sony: ‘ఊబర్ ట్యాక్సీ నడుపుకొని బతకండి..’.. ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కు బాస్ సలహా!

Job Layoffs Sony: ‘ఊబర్ ట్యాక్సీ నడుపుకొని బతకండి..’.. ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌కు బాస్ సలహా!

Job Layoffs Chris Deering| సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రతీ సంవత్సరం చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వార్తలు వింటూనే ఉంటాం. బిజినస్ జరగడంలేదని, నష్టాల్లో ఉందని, లేదా ఆర్థిక సంక్షభమని కంపెనీలు ఎన్నో కారణాలు చెప్పి ఉద్యోగులను తొలగిస్తూ ‘లే ఆఫ్స్’ ప్రకటిస్తాయి. అయితే ఉద్యోగుల ద్వారా కంపెనీలు కోట్లు సంపాదించిన ఉదాహరణలు చూపుతూ ఉద్యోగుల సంఘాలు కూడా కంపెనీల తీరును విమర్శిస్తుంటాయి.


అయితే తాజాగా ఓ దిగ్గజ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉచిత సలహా ఇచ్చాడు. ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టి ఒక సంవత్సరం ఖర్చు తగ్గించుకొని బతకాలని.. ఏదో చేతికి అందిన పనిచేసుకొని బతకాలసి ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజెన్లు మండిపడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. వీడియో గేమ్ దిగ్గజ కంపెనీ సోనీ కంప్యూటర్ ఎంటర్‌టైన్మెంట్.. ఇటీవల యూరోప్ లో దాదాపు 900 మంది గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీనికి వ్యతిరేకంగా బ్రిటన్ లోని గేమింగ్ ఉద్యోగుల సంఘం ( Independent Workers Union of Great Britain -IWGB) నిరసనలు చేస్తోంది. కంపెనీలు చాలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నాయని వందల కోట్లు ఉద్యోగుల ద్వారా సంపాదించి.. ఇప్పుడు కొంతకాలం లాభాలు తగ్గిపోగానే.. నష్టాలు అని సాకులు చూపి ఉద్యోగులను తొలగించడాన్ని బ్రిటన్ గేమింగ్ ఉద్యోగుల సంఘం సభ్యులు తప్పుబట్టారు.


Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

ఈ వివాదం నడుమ.. సోనీ కంపెనీ మాజీ ప్రెసిడెంట్ క్రిస్ డీరింగ్ ఒక పాడ్ కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో క్రిస్ మాట్లాడుతూ.. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఒక సంవత్సరం పాటు వెకేషన్ కు వెళ్లి.. ప్రశాంతంగా జీవించాలని సూచించాడు. ఆర్థికంగా కష్టాలుంటే చేతికి అందిన పనిచేసుకోవాలని.. లేకపోతే ఊబర్ ట్యాక్సీ నడుపుకొని జీవనం సాగించాలిన సలహా ఇచ్చాడు. ”మీరు కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఏ చేయాలో మీరే చూసుకోవాలి, ఊబర్ ట్యాక్సీ నడపండి లేదా ఏదైనా చేసుకోండి. తక్కువ రెంట్ ఉన్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వండి. జాబ్ మార్కెట్ రికవర్ అయ్యేంత వరకు లేదా కొత్త అవకాశాలు లభించేత వరకు కష్టపడక తప్పదు. మీరు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందే. కరోనా కాలంలో కూడా ఉద్యోగులు ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. ” అని ఫైర్ అయిన ఉద్యోగులను ఉద్దేశించి పాడ్ కాస్ట్ లో వ్యాఖ్యలు చేశాడు.

క్రిస్ డీరింగ్ వ్యాఖ్యలను యూరోప్ గేమింగ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించింది. జాబ్ సెక్యూరిటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చూసుకోవాలంటే ఉద్యోగులందరూ ఏకమై కంపెనీలతో పోరాడాలని పిలుపునిచ్చింది. అలా చేయకపోతే కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాయని.. ట్విట్టర్ ఎక్స్ లో ఐడబ్లుజిబి పోస్ట్ చేసింది.

గత సంవత్సరం దాదాపు 20000 గేమింగ్ డెవలపర్స్ లే ఆఫ్స్ ప్రక్రియలో ఉద్యోగాలు కోల్పోయారు. కానీ 2024 మే నెల వరకు గణాంకాలు చూస్తే.. సోనీ, మైక్రోసాఫ్ట్, యూనిటీ కంపెనీలు గేమింగ్ డివిజన్ లో దాదాపు 10000 మంది ఉద్యోగాల నుంచి తొలగించాయి.

Related News

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Viral Video: హాలీవుడ్ మూవీని తలపించేలా కారు ప్రమాదం.. వెంట్రుకవాసిలో బయటపడ్డాడు, వైరల్ వీడియో

Big Stories

×