BigTV English

TSSPDCL : లైన్‌మ్యాన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

TSSPDCL : లైన్‌మ్యాన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

TSSPDCL: హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీఎస్‌ఎస్పీడీసీఎల్‌.. లైన్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1553 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐటీఐలో ఎలక్ట్రికల్ / వైర్ మ్యాన్ విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి. ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ వొకేషనల్ కోర్సులో ఉత్తీర్ణులైన వారు కూడా ఈ ఉద్యోగానికి అర్హులే. రాత పరీక్ష, పోల్ క్లైంబింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష కేంద్రాలు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఏర్పాటు చేస్తారు.


మొత్తం జూనియర్‌ లైన్‌మ్యాన్ పోస్టులు :1553
అర్హత : పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/ వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్‌ వొకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణత
వయసు : 18- 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుం : రూ.320 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, EWS అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 08-03-2023
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 28-03-2023
దరఖాస్తుల సవరణకు గడువు : 01-04-2023 నుంచి 04-04-2023 వరకు
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం : 24-04-2023
పరీక్ష తేదీ : 30-04-2023


వెబ్‌సైట్‌: https://www.tssouthernpower.com/

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×