E-Paper
Advertisement

Chudamani:చూడామణిలో దొంగతనం చేయాలన్ని ఆచారం ఎలా మొదలైంది

Chudamani:చూడామణిలో దొంగతనం చేయాలన్ని ఆచారం ఎలా మొదలైంది
Advertisement

Chudamani:సాధారణంగా గుడిలో ఏదైనా వస్తువు దొంగతనం చేసి తీసుకెళ్లాలంటే అపచారం అని లెంపలేసుకుంటారు. కానీ ఉత్తరాఖండ్‌లోని ఈ ఆలయంలోనే వింత ఆచారం ఉన్నది. రూర్కీ జిల్లాలోని చూడియాలాలో చూడామణి ఆలయానికి వచ్చిన భక్తులు కచ్చితంగా దొంగతనం చేయాల్సిందేనట. అలా చేస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.పురాతనమైన చూడామణి ఆలయం.. సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే అలా జరగాలంటే మాత్రం గుడికి వచ్చేవాళ్లు కచ్చితంగా దొంగతనం చేయాలట. అలా చేస్తే ఎవరూ అడ్డు చెప్పరు. దొంగతనం చేయమని స్వయానా పూజారులే ప్రోత్సహిస్తారు.

అమ్మవారి మెడలో ఉన్న బంగారమో.. గుడిలో ఉన్న డబ్బునో దొంగతనం లాంటివి దొంగతనం చేయకూడదు. అమ్మవారి పాదాల దగ్గర చెక్క బొమ్మలు ఉంటాయట. వాటిని ఎవరైతే దొంగతనం చేస్తారో వారికి అందమైన, ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతారని భక్తులు నమ్ముతారు. అదంతా అక్కడ పురాతన ఆచారంలో భాగంగా చేస్తారు.

Advertisement

చెక్క బొమ్మను దొంగిలించి ఇంటికి తీసుకెళ్లడమే కాదు.. బిడ్డ పుట్టిన తర్వాత ఆ చెక్క బొమ్మను మళ్లీ ఎక్కడి నుంచైతే తీసుకున్నారో అక్కడే పెట్టాలట. దానితో పాటు మరొక బొమ్మను కూడా తీసుకురావలన్నది ఆ ఆలయ ఆచారమట.

ఈ ఆచారం వెనుక ఒక కథ కూడా ఉంది. లాందౌరా రాజు ఒకరోజు అడవిలో సంచరిస్తుండగా చూడామణి ఆలయాన్ని చూసి తమకు బిడ్డను ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నాడు. దీంతో అమ్మవారు మాయమై చెక్కరూపంలో దర్శనమిచ్చింది. ఆ చెక్క బొమ్మను తీసుకొని ఇంటికి వెళ్లిన రాజు దంపతులకు కొన్నాళ్ల తర్వాత పండంటి బిడ్డ పుట్టాడు. రాజు.. వెంటనే సతీసమేతంగా ఆలయానికి వెళ్లి తాను తీసుకెళ్లిన చెక్కబొమ్మతో పాటు మరో చెక్కబొమ్మనూ అమ్మవారికి సమర్పించాడట. అలా మొదలైన ఆచారం ఇప్పటికీ అలానే కొనసాగుతోంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×