E-Paper
Advertisement

Panchamurthy:- పంచమూర్తులు ఎవరు…ఎక్కడుంటారు..?

Panchamurthy:- పంచమూర్తులు ఎవరు…ఎక్కడుంటారు..?
Advertisement

Panchamurthy:- హిందూ సంప్రదాయాల ప్రకారం ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు. సృష్టి స్థితి లయకి అనేక బాధ్యలు నిర్వహిస్తుంటారని నమ్మకం. కోటానుకోట్ల జీవులు నిత్యం పుడుతూ , చనిపోతూ, తిరిగి జన్మిస్తూ … ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వాటిని సమర్థవంతంగా నిర్వహించే పనని పంచమూర్తులు చేస్తుంటారు.

కోరిన కోర్కెలు తీర్చే వరప్రదాయకులు ఈ పంచమూర్తులు . చాలా మంది త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు మరో ఇద్దరు దేవతలని కలిపి పంచమూర్తులుగా చెబుతుంటారు. కానీ, పంచమూర్తులంటేవినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, పరమేశ్వరుడు , పార్వతీదేవి , చండికేశ్వరుడు . వీళ్ళ ఐదుగురిని కలిపి పంచమూర్తులుగా పిలుస్తారు.

Advertisement

ఏటా శివరాత్రి రోజున శ్రీకాళహస్తిలో పంచమూర్తులనూ ఊరేగిస్తారు . నందిపైన అయ్యవారు , కామధేనువు పైన జ్ఞానప్రసూనాంబగా అమ్మ మిగిలిన పంచమూర్తులూ వెంట తరలిరాగా కన్నుల పండుగగా పురవీధులలో ఊరేగుతూ దర్శనమిస్తుంటారు. .

కర్ణాటకలోని నంజనగూడులో శ్రీ కంఠేశ్వరుడు కూడా ఏడాదికి రెండుమార్లు జాతర జరుపుకుంటారు . తన పరివారమైన పంచమూర్తులతోనూ ఊరేగుతారు. కాబట్టి పంచమూర్తులు అంటే త్రిమూర్తుల స్వరూపాలుకాదు . విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు , జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడు , కార్యసాధకుడు , అనుగ్రహప్రదాత ఐన చండికేశ్వరుడు పరివారంగా పార్వతీ, పరమేశ్వరులని కలిపి పంచమూర్తులుగా పిలుస్తాంటారు. పంచ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×