Bhagya Shree Borse: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున భాగ్యశ్రీ (Bhagya Shree)పేరు గుర్తుకొస్తుంది. క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న భాగ్యశ్రీ నటించిన సినిమాలన్నీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈమె దుల్కర్ సల్మాన్(Dulquer Salman) తో కలిసి నటించిన కాంత(Kaantha) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక నేడు ఉదయం ఏ సినిమా ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ కు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం తాజాగా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రానా (Rana) మాట్లాడుతూ హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ తన అద్భుతమైన నటనను కనబరిచిందని తెలిపారు.నిజానికి ఈ మేడంను మొదట పట్టింది మేమేనని కాకపోతే మా సినిమా కాస్త ఆలస్యం కావడంతో ఇప్పటికే ఈమె నటించిన సినిమాలన్నీ విడుదలవుతూ వస్తున్నాయని రానా అసలు విషయం వెల్లడించారు.
సెల్వరాజ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు పిరియాడిక్ సినిమా కావడంతో ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ అయితే సరిగ్గా సరిపోతారని , ఇక హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తుంటే భాగ్యశ్రీ ఫైనల్ అయిందని అలా ఈమెను మొదటిసారి తెలుగు సినిమా కోసం ఎంపిక చేసింది మేమే కానీ మా సినిమా కంటే ముందుగా ఇతర సినిమాలు కూడా విడుదలయ్యాయని తెలిపారు. ఇక రానా భాగ్యశ్రీ గురించి మాట్లాడుతుంటే అభిమానులు ఒక్కసారిగా మేడం సర్ మేడం అంతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి.
వరుస సినిమాలతో బిజీగా..
ఈ సినిమా గురువు అయిన దర్శకుడు, శిష్యుడైన హీరో మధ్య వచ్చే విభేదాల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించగా స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, ప్రశాంత్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక భాగ్యశ్రీ సినిమాల విషయానికి వస్తే ఇదివరకు ఈమె కింగ్డమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక త్వరలోనే కాంత సినిమాతో పాటు, రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా నవంబర్ 27వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ రెండు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగ్యశ్రీ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Also Read: Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!