Mithra Mandali OTT : ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటించిన ‘మిత్రమండలి’ థియేటర్లలో దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 16న రిలీజ్ అయి భారీ ఫ్లాప్ అయింది. దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, సత్య, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఒక మిస్‌ఫిట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ రాజకీయ నాయకుడి కూతురు ప్రేమలో పడి రాజకీయ కుట్రల్లో చిక్కుకుని కామెడీ ఆఫ్ ఎర్రర్స్ సృష్టించే కథ ఇది. థియేటర్లలో నెగెటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్‌లో డిజాస్టర్ అయింది. కానీ మేకర్స్ ఇప్పుడు ఓటీటీలో సెకండ్ ఛాన్స్ ట్రై చేస్తున్నారు. స్పెషల్‌గా ఆడియెన్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుని రీ-ఎడిట్ చేసి, ట్రిమ్ చేసి న్యూ వెర్షన్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ సినిమా 2025 నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ప్రియదర్శి సొంతంగా ఎక్స్‌లో పోస్ట్ చేసి “వి లాఫ్డ్, వి లెర్న్డ్, వి రీకట్” అని చెప్పి ఈ రీ-ఎడిటెడ్ వెర్షన్‌ను అనౌన్స్ చేశాడు. థియేట్రికల్ వెర్షన్‌లో ఉన్న లూజ్ ఎండ్స్, స్లో సీన్స్ కట్ చేసి, హ్యూమర్ పంచ్‌లు పెంచి ఓటీటీ ఆడియెన్స్‌కి సూట్ అయ్యేలా మార్చారు. బన్నీ వాసు ప్రెజెంట్ చేసిన ఈ మూవీని బీవీ వర్క్స్ బ్యానర్‌పై కల్యాణ్ మంథిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పుడు ఓటీటీలో ఈ రీలోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా? అనేది నవంబర్ 6న ప్రైమ్‌లో చూసిన తరువాతనే ఆడియన్స్ ఒపీనియన్ తెలుస్తుంది.
Read Also : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్
జంగ్లీ పట్టణంలో తుట్టె కులానికి నారాయణ (వీటీవీ గణేష్) అనే వ్యక్తి పెద్ద మనిషిగా ఉంటాడు. తన కులాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఉంటాడు. దీంతో రాజకీయాలలోకి కూడా అడుగు పెడతాడు. తన కుల బలంతో ఎమ్మెల్యే గా పోటీ చేయాలనుకుంటాడు. అయితే ఈ సమయంలో నారాయణ కూతురు స్వేఛ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది. దీంతో రాజకీయంగా, కులంలో కూడా పరువుపోతుందని ఎస్సై సాగర్ (వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. పనిపాట లేకుండా తిరిగే చైతన్య (ప్రియదర్శి), సాత్విక్(విష్ణు ఓ.ఐ), అభి (రామ్ మయూర్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) లని స్వేచ్ఛ కలుస్తుంది. ఇక్కడ ఈ ఆకతాయిలు లవ్ ట్రాక్ కూడా నడుపుతారు. ఆ తరువాత అసలు ట్విస్ట్ వస్తుంది. స్వేచ్ఛ పారిపోవడానికి కారణం ఏమిటి ? ఆమె ఎవరి ప్రేమలో పడుతుంది ? ఎస్సై సాగర్ స్వేచ్ఛ ని కనిపెడతాడా ? నారాయణ ఎమ్మెల్యే అవుతాడా ? అనే విషయాలను, ఈ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.