Vivo Y19s 5G vs iQOO Z10 Lite 5G vs Moto G45 5G Comparison| ఇటీవల వివో కంపెనీ తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్ అయిన Y19s 5Gని లాంచ్ చేసింది. ఇదే రేంజ్ లో మార్కెట్‌లో iQOO Z10 Lite 5G, మోటో G45 5G ఫోన్లు ఉన్నాయి. ఇండియాలో ప్రస్తుతం లో-బడ్జెట్ 5G మార్కెట్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూడు ఫోన్లు ఈ తక్కువ బడ్జెట్ రేంజ్‌లో బ్రాండ్ విలువతో పాటు, మంచి ఫీచర్లతో పోటీ పడుతున్నాయి. ఈ మూడు ఫోన్లలో ఏది కొనుగోలు చేయాలో వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.
వివో Y19s 5G 4GB RAM + 64GB స్టోరేజ్ ధర రూ.10,999 నుంచి మొదలు. 4GB + 128GB వేరియంట్ ధర రూ.11,999.
iQOO Z10 Lite 5G కేవలం రూ.10,499కే 4GB + 128GB ఆప్షన్‌లో లభిస్తుంది. అంటే వివో కంటే iQOO తక్కువ ధర.
మోటో G45 5G ధర రూ.11,999, కానీ ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. మిగతా రెండు బ్రాండ్ల కంటే ఇందులో ఎక్కువ RAM ఉంది.
వివో Y19s 5Gలో 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz, 700 నిట్స్ బ్రైట్‌నెస్.
iQOO Z10 Lite కూడా అదే 6.74 అంగుళాల HD+ LCD, 90Hz రిఫ్రెష్ రేట్ కానీ 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. అలాగే బయట ఎండలో కూడా మెరుగ్గా కనిపిస్తుంది.
మోటో G45లో 6.5 అంగుళాల HD+ స్క్రీన్, కానీ 120Hz రిఫ్రెష్ రేట్. ఇందులోని స్మూత్ స్క్రోలింగ్ తో గేమింగ్‌కి ఈ ఫోన్ బెస్ట్.
వివో Y19s 5G: 13MP మెయిన్ + 0.8MP సెకండరీ రియర్ (వెనుక) కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. సాధారణ ఫోటోలకు ఈ ఫోన్ ఓకే.
iQOO Z10 Lite: 50MP మెయిన్ + 2MP డెప్త్ రియర్, 5MP ఫ్రంట్ లెన్స్ లతో ఐక్యూ మంచి డీటెయిలింగ్ తో ఫోటోలు తీయగలదు.
మోటో G45: 50MP మెయిన్ + 2MP అల్ట్రా-వైడ్ మాక్రో రియర్, 16MP ఫ్రంట్ కెమెరాలతో ఈ ఫోన్ సెల్ఫీలు, వైడ్ షాట్స్‌కి సూపర్.
వివో Y19s, iQOO Z10 Lite రెండూ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉపయోగిస్తాయి – రోజువారీ టాస్కులకు చాలా బాగుంటుంది.
మోటో G45లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. మూడింటిలో కొంచెం భిన్నమైన, మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
వివో , iQOO రెండూ ఫన్ టచ్ OS 15 (ఆండ్రాయిడ్ 15 బేస్) ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. కానీ బ్లోట్‌వేర్ ఉంటుంది.
మోటో G45: క్లీన్ ఆండ్రాయిడ్ 14 – స్టాక్ లాంటిది. ఈ ఫోన్ సాఫ్ట్‌వేర్ సింపుల్‌గా ఫాస్ట్ గా ఉంటుంది.
వివో Y19s: 4GB/6GB RAM, 128GB వరకు స్టోరేజ్, 6000mAh బ్యాటరీ + 15W చార్జింగ్ – భారీ బ్యాటరీ.
iQOO Z10 Lite: 4GB/6GB/8GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో కూడా 6000mAh బ్యాటరీ + 15W ఫాస్ట్ చార్జింగ్ ఇస్తుంది.
మోటో G45: 8GB RAM + 128GB, 5000mAh + 20W ఫాస్ట్ చార్జింగ్ – త్వరగా చార్జ్ అవుతుంది.
సాధారణ ఉపయోగం, పెద్ద బ్యాటరీ కావాలంటే వివో Y19s బెస్ట్. మంచి కెమెరా హార్డ్‌వేర్ కోసం iQOO Z10 Lite తీసుకోండి. ఎక్కువ RAM, స్మూత్ డిస్‌ప్లే, క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలంటే మోటో G45 ఎంచుకోండి. మీ అవసరాలను బట్టి నిర్ణయించుకోండి.
Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి