టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తీసుకొచ్చిన ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 10 డివైజ్ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. క్రేజీ ఫీచర్లను, అదిరిపోయే స్పెసిఫికేషన్లు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తున్నాయి. ఒకవేళ ఈ అద్భుతమైన డివైజ్ ను మీకూ కొనుగోలు చేయాలనిపిస్తే, ఇదే బెస్ట్ టైమ్. ఎందుకంటే, అమెజాన్ అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఏకంగా రూ.15,500 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంచింది. ఈ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను మరెక్కడా లేని తగ్గింపుతో అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ వెంటనే కొనుగోలు చేయడం వల్ల ఈ భారీ తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. ఇంతకీ ఈ డీల్ ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రీసెంట్ గా అందుబాటులోకి వచ్చిన గూగుల్ పిక్సెల్ 10 దేశీ మార్కెట్లో రూ.79,999 ప్రారంభ ధరకు లభిస్తోంది. అయితే, అమెజాన్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీద ప్రస్తుతం భారీ తగ్గింపు అందిస్తోంది. ప్లాట్ డిస్కౌంట్ పేరుతో రూ.11,570 తగ్గింపు ఇస్తుంది. దీని ధర రూ.68,429కి తగ్గుతుంది. దానితో పాటు, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ సదుపాయాలతో మరింత తగ్గింపు ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 10 లేటెస్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. 6.3-అంగుళాల OLED స్క్రీన్ తో వస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో ప్రొటెక్ట్ చేయబడుతుంది. గూగుల్ పిక్సెల్ 10కి Tensor G5 చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12GB వరకు RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. 15W వరకు వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 4,970 mAh బ్యాటరీతో వస్తుంది.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!
గూగుల్ పిక్సెల్ 10 ఫోటోగ్రఫీ పరంగా, మాక్రో ఫోకస్ తో కూడిన 48MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. 13MP అల్ట్రావైడ్ లెన్స్, 5× ఆప్టికల్ జూమ్ ను అందించే 10.8MP టెలిఫోటో లెన్స్ ను కలిగి ఉంది. అటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 10.5MP కెమెరా ఉంది. సో, ఈ క్రేజీ డీల్ లో ఈ అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయండి.
Read Also: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?