Parasuramudu : మహా విష్ణువుని మానవ రూపమే పరశురాముడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. గొప్ప తపః సంపన్నుడైన భృగు మహర్షి వంశంలో జన్మించిన రుచిక మహర్షి కుమారుడు జమదగ్ని మహర్షి, జమదగ్ని మహర్షి పుత్రుడు పరశురాముడు.
వాస్తవానికి పరశురాముని పూర్వనామం రాముడు.
పరశురాముడి తపస్సును మెచ్చి ఎన్నో ఆయుధాలను వరాలను పరమ శివుడు ప్రసాదించాడు. శివుడు ప్రసాదించిన ఆయుధాల్లో పరశువు ఒకటి. శివుడు నుంచి ఆయుధాన్ని పొందిన తర్వాత ఈ మహితాత్ముడు పరశురాముడిగా ఖ్యాతికెక్కాడు. విష్ణువు దశావతారాల్లో పరశరాముడు కూడా ఒక అవతారంగా కొందరు భావిస్తారు. పరశురాముడు శ్రీరాముడి కంటే ముందటి వాడు.
కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షిని అవమానించి ఆశ్రమంలోని కామధేనువును తనతోపాటు తీసుకెళ్లడం, పరశురాముడు అతడ్ని సంహరించడం జరిగింది. ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడు కుమారులు జమదగ్ని మహర్షిని ఘోరాతి ఘోరంగా సంహరించారు. అప్పుడే పరశురాముడు దేశంలోని క్షత్రియులందరిని సంహరిస్తానని శపథం చేశాడు .ఆ శపథం నెరవేరాలంటే ఎన్నో శక్తులు, ఆయుధాలు కావాలి. అందుకే శివుని కోసం పరశురాముడు ఘోరమైన తప్పు చేసి గండ్ర గొడ్డలి సంపాదించాడు.
ఆయుధంతోనే 21 సార్లు క్షత్రియులను వెంటాడి సంహరించాడు.