E-Paper
Advertisement

Ram Charan : ‘ఆచార్య’ డిజాస్టర్‌పై రామ్ చ‌ర‌ణ్ రియాక్ష‌న్‌… విమ‌ర్శ‌లు చేస్తున్న నెటిజ‌న్స్

Ram Charan : ‘ఆచార్య’ డిజాస్టర్‌పై రామ్ చ‌ర‌ణ్ రియాక్ష‌న్‌… విమ‌ర్శ‌లు చేస్తున్న నెటిజ‌న్స్
Advertisement

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘ఆచార్య’. భారీ అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. డిస్ట్రిబ్యూట‌ర్స్, బ‌య్య‌ర్స్‌కి చాలా న‌ష్టాలే వ‌చ్చాయి. వారందరికీ సెటిల్ చేసి వ్య‌వ‌హారాన్ని స‌ద్దుమ‌ణిగేలా చేశారు. అయితే ఈ ఫెయిల్యూర్‌ని మాత్రం ఇటు చిరంజీవి, అటు రామ్ చ‌ర‌ణ్ జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ మ‌ధ్య ఓ వేదిక‌పై కొర‌టాల ఇన్ డైరెక్ట‌ర్‌గా ఉద్దేశిస్తూ చిరంజీవి చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు దారి తీశాయి. తాజాగా ఇప్పుడు ఆచార్య విష‌యంలోనే రామ్ చ‌ర‌ణ్ కూడా విమ‌ర్శ‌ల పాల‌య్యాడు. ఎందుకంటే రీసెంట్‌గా ఢిల్లీలో జ‌రిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న చెర్రీ.. సినిమాల్లో మారుతున్న ట్రెండ్ గురించి మాట్లాడారు.

ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ను ఆస్వాదిస్తున్నార‌ని, ఆద‌రిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత తాను ఓ సినిమాలో గెస్ట్ చేయ‌గా.. అది స‌రిగ్గా లేక‌పోవ‌టంతో స‌రిగ్గా ఆడ‌లేదని కామెంట్స్ చేశారు. అంటే RRR త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేసిన సినిమా ఆచార్య‌. ఆ సినిమాలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌. త‌న పాత్ర‌ను బేస్ చేసుకునే ప్ర‌ధాన క‌థ న‌డుస్తుంది. అలాంటి పాత్ర‌ను గెస్ట్ రోల్ అన‌టం.. ఫెయిల్యూర్‌ను స్వీక‌రించ‌లేక దాన్ని కొర‌టాల శివ‌కే క‌ట్ట‌బెట్టాల‌నే ప్ర‌య‌త్నం చేయ‌టం అనేవి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. నెటిజ‌న్స్ చ‌ర‌ణ్ తీరుని త‌ప్పుప‌డుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×