CM Revanth Reddy: బీఆర్ఎస్ సభ్యులపై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. బీసీల రిజర్వేషన్లు విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు కడుపులో విషం పెట్టుకున్నట్లు ఆ పార్టీ సభ్యుడు గంగుల మాటల ద్వారా స్పష్టమవుతోంది. 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాలు గుద్దిబండగా మారాయన్నారు.
ఈ చట్టాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకంగా మారిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తే సంతోషమని గంగుల అంటున్నారని, ఆ పార్టీ చెందిన నేతల మాటలు మరోలా ఉన్నాయన్నారు. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని గుర్తు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఆదివారం ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ అవర్ రద్దు చేసిన ప్రభుత్వం.. అసెంబ్లీలో తొలుత ప్రభుత్వ బిల్లులపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో సభ ముందుకు పంచాయతీ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు వచ్చాయి.
తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ఆర్డినెన్స్ కుదరదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పామని, అందుకోసమే ఈ బిల్లు తెచ్చినట్టు తెలిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లుపై మాట్లాడారు.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. కన్నేసిన అధికార పార్టీ, తెర వెనుక పావులు
రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. రెండు బిల్లులు గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపారని గుర్తు చేశారు. బీసీ బిల్లు విషయంలో ప్రజల్లో అపోహాలు కలిగించేలా సభలో బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీకి ఐదుసార్లు లేఖలు రాసినట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రధాని నుంచి అపాయింట్మెంట్ రాకపోవడంతో పార్లమెంటు సమావేశాల సమయంలో జంతర్ మంతర్ వేదికగా దీక్షకు దిగినట్టు తెలియజేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్దతు పలికారని, రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. చివరకు ఆ పార్టీ సభ్యుడు గంగుల కమలాకర్ సైతం రాలేదన్నారు.
ఈ లెక్కన ఆ పార్టీ నేతలు బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంలేరని తేలిపోయిందన్నారు ముఖ్యమంత్రి. ఈ బిల్లు ఆమోదం చెందకుండా, అబద్దాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటివారికి కను విప్పు కలిగేలా ప్రతీ ఏడాది ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డే కోసం తీర్మానం మంత్రి పొన్న ప్రవేశపెడితే ఆమోదించామన్నారు.
బిల్లుల విషయంలో మాకు సూక్తులు చెప్పాల్సిన పని లేదని, తొలుత వారి నాయకుడ్ని సభకు రావాలన్నారు. ఈ క్రమంలో గంగుల కమలాకర్‌కు సూచన చేశారు. ఈ విషయంలో ఒత్తిళ్లకు లొంగవద్దని, మంచిచెడ్డలు ఏమైనా ఉంటే చూసుకుంటానన్నారు.
రాజకీయ వివాదాలకు తావు లేకుండా, సూచనలు చేస్తే తప్పకుండా తీసుకుంటామన్నారు. కల్వకుంట్ల కాదు.. కల్వకుండా చూసే కుటుంబమన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. చర్చ లేకుండా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లో పలచన కావద్దన్నారు. యజమాని మెప్పు పొందేందుకు పదజాలం ఉపయోగిస్తే మీరు చులకన అవుతారన్నారు. వారు చేసిన పాపాలను తాము కడుగుతున్నామన్నారు.
50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాలు గుద్దిబండగా మారాయి: సీఎం రేవంత్ రెడ్డి
ఈ చట్టాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికలకు ఆటంకంగా మారింది
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వస్తే సంతోషమని గంగుల అంటున్నారు
కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం కడపులో… pic.twitter.com/TRLoMmt6yv
— BIG TV Breaking News (@bigtvtelugu) August 31, 2025
కల్వకుంట్ల కాదు కల్వకుండా..!
కేసీఆర్ కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి
బీసీలు ఓసీలు కల్వకూడదు
ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు
హిందువులు, మైనార్టీలు కల్వకూడదు
ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/gwWPM44pY8
— BIG TV Breaking News (@bigtvtelugu) August 31, 2025