BigTV English

Salman Nizar – KCL : 6, 6, 6, 6, 6, 1, 6, 6, 6, 6, 6, 6… 12 బంతుల్లో 11 సిక్సర్లు..వీడియో చూస్తే

Salman Nizar – KCL : 6, 6, 6, 6, 6, 1, 6, 6, 6, 6, 6, 6… 12 బంతుల్లో  11 సిక్సర్లు..వీడియో చూస్తే

Salman Nizar – KCL : సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ బ్యాటర్ రెచ్చిపోతాడో చెప్పడం కష్టంతో కూడుకున్న పనే. ఎంతో నమ్మకంగా బ్యాటింగ్ చేస్తాడనుకున్న బ్యాటర్ విఫలం చెందుతున్నాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలెంట్ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అయితే వారిలో చాలా తక్కువ మంది మాత్రతమే బయటికి వస్తున్నారు. ముఖ్యంగా భారత్ లో రోజు రోజుకు కొత్త కొత్త స్టార్లు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో చాలా రాష్ట్రాల్లో టీ-20 లీగ్ లు జరుగుతున్నాయి. ఆ లీగ్ ల్లో పరుగుల్లో సునామీ సృష్టిస్తున్నారు. తాజాగా కేరళ క్రికెట్ లీగ్ లో సల్మాన్ నిజార్ బ్యాటింగ్ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సల్మాన్ నిజార్ చివరి 12 బంతుల్లో 11 సిక్స్ లు కొట్టి రికార్డు నెలకొల్పాడు. దీంతో ఒక్క ఓవర్ లోనే 40 పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. 


Also Read : Rashid Khan : రషీద్ ఖాన్ ఇంట తీవ్ర విషాదం… డ్రెస్సింగ్ రూమ్ లో పాకిస్తాన్ ప్లేయర్ల హడావిడి

12 బంతుల్లో 11 సిక్స్ లు.. 


కేరళ క్రికెట్ లీగ్ లో అదానీ తిరువనంతపురం రాయల్స్ వర్సెస్ కాలికట్ గ్లోబల్ స్టార్ మధ్య జరిగిన మ్యాచ్ లో అభిమానులకు మంచి ఎంటర్టైన్ మెంట్ లభించినట్టు అయింది. కాలికట్ గ్లోబ్ స్టార్ జట్టు 18 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 115 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఆ సమయంలో 13 బంతుల్లో 17 పరుగులు చేసి క్రీజులో ఉన్న నిజార్ పై అందరూ ఆశలు పెట్టుకున్నారు. 19వ ఓవర్ లో సల్మాన్ తొలి 5 సిక్స్ లు బాది చివరి బంతికి ఒక్క పరుగు తీసుకున్నాడు. ఇక ఆ తరువాత చివరి ఓవర్ లో 6 సిక్స్ లు కొట్టాడు. ఈ ఓవర్ లో ఒక నోబాల్ వైడ్ కూడా ఉన్నాయి. ఇలా ఒకే ఓవర్ లో ఏకంగా 40 పరుగులు వచ్చాయి. సల్మాన్ చివరి 12 బంతుల్లో 11 సిక్స్ లు కొట్టాడు. ఈ రెండు ఓవర్లలో మొత్తం 71 పరుగులు వచ్చాయి. దీంతో అతని జట్టు 20 ఓవర్లలో 186 పరుగులు చేసింది. సల్మాన్ కేవలం 26 బతుల్లోనే 86 పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించాడు.

సల్మాన్ విధ్వంసం..  ఇది తొలిసారి కాదు..

ముఖ్యంగా సల్మాన్ నిజార్ చేసినటువంటి 86 పరుగుల ఇన్నింగ్స్ లో మొత్తం 12 భారీ సిక్స్ లు ఉండటం విశేషం. ఈ కేరళ క్రికెట్ లీగ్ 2025 సీజన్ లో సల్మాన్ విధ్వంసం క్రియేట్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ఈ లీగ్ లో అతను 26 బంతుల్లో అజేయంగా 48 పరుగులు, 34 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సల్మాన్ ను ట్రయల్స్ కి పిలిచింది. అతని ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ లలో కొత్త కొత్త బ్యాటర్లు వెలుగులోకి రావడం విశేషం. 

?igsh=eW1wdnNiczRoczg2

Related News

BCCI : రూ. 452 కోట్లకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ షిప్.. బీసీసీఐ అదిరిపోయే స్కెచ్?

David Warner : మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో విలన్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్?

IPL 2026 : IPL 2026 కంటే ముందే పెను మార్పులు…ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త కెప్టెన్?

IND Vs PAK : ఆసియా కప్ లో పాక్ vs ఇండియా మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు.. కొత్త టైమింగ్ ఇదే!

Lalit Modi : శ్రీశాంత్ భార్యపై లలిత్ మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు.. నీకేంటి నొప్పి అంటూ

Rajasthan Royals : రాజస్థాన్ జట్టులో ముసలం…ద్రవిడ్ తో పాటు సంజూ, జైస్వాల్ ఔట్?

Big Stories

×