BigTV English

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్ట్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్త చేసుకోవచ్చు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి. సెలక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగాలు – వెకెన్సీలు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


నోట్: రేపే లాస్ట్ డేట్

ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్- ఏ, బీ, సీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఆగస్ట్ 31న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 394

సెంట్రల్ కౌన్సిల్ ఫర్‌ రీసెర్చ్ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌ గ్రూప్-ఏ, బీ, సీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎండీ, ఎంఎస్, ఎంఫార్మ్, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. గ్రూప్- ఏ పోస్టులకు రూ.15,600 నుంచి రూ.39,100 జీతం ఉంటుంది. గ్రూప్ -బీ పోస్టులకు అయితే రూ.9300 నుంచి రూ.34,800 జీతం ఉంటుంది. గ్రూప్- సీ పోస్టులకు రూ.9300 నుంచి రూ.34,800 జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ముఖ్యమైన డేట్స్….

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 1

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 31

దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఏ, బీ, సీ పోస్టులకు జనరల్, ఓబీసీ, అభ్యర్థులకు రూ.1000, 500, 200 ఫీజు ఉంటుంది. ప్రాసెసింగ్‌ ఫీజు 500, 200, 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ ఈడబ్ల్యూఎస్‌, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఉద్యోగ ఎంపిక విధానం: సీబీటీ, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ccras.nic.in/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 394

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31

అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.. ఆల్ ది బెస్ట్.

ALSO READ: IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

Related News

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!

JNTU Hyderabad: భారీ వర్షాలు.. ఈ పరీక్షలన్నీ వాయిదా

PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Big Stories

×