BigTV English

Placement of a Tortoise : తాబేలు ప్రతిమను ఏ దిశలో ఉంచితే మంచిది?

Placement of a Tortoise : తాబేలు ప్రతిమను  ఏ దిశలో ఉంచితే మంచిది?

Placement of a Tortoise : వాస్తు ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల చాలా లాభాలున్నాయి. తాబేలు ఇంట్లో సానుకూలతను పెంచుంది. ఆ ఇంట్లో ఉండే వారు మంచి ఆరోగ్యాన్ని, సంపదను కలిగి ఉంటారు. తాబేలును కూర్మావతార రూపంలో ఉన్న విష్ణుమూర్తి ప్రతీకగా భావిస్తారు. శ్రీ మహా విష్ణువు కూర్మావతారంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను చూపాడని శాస్త్రాల్లో తెలియచేశారు. విష్ణువు రెండో అవతారం కూర్మావతారమే . కాబట్టి విష్ణువు రూపంలోని తాబేలును ఇంట్లో ఉంచడం శుభప్రదం.


తాబేలును ఉంచే దిశ కూడా చాలా ముఖ్యమైనది.పడకగదిలో ఉంచినట్లయితే, ఇది నిద్రలేమి మరియు ఆందోళనకు చికిత్స చేస్తుంది. వాస్తు ప్రకారం తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తర దిశలో ఉంచబడిన లోహపు తాబేళ్లు వాటి ఏకాగ్రతను పెంచుతాయి. వాటిని వాయువ్య దిశలో ఉంచడం వారి మనస్సుకు పదును పెట్టడంలో సహాయపడుతుంది.

ఉత్తర దిక్కులో ఎందుకు పెట్టాలి?


తాబేలు ప్రతిమను ఇత్తడిలోగాని, క్రిష్టల్ లో గాని తీసుకుని ఇత్తడి పళ్లెం లేదా పింగాణి, గాజు పళ్లెంలో నీళ్లు పోసి ఉత్తర దిక్కునే పెట్టాలి. ప్రతీరోజు ఉదయాన్నే ప్లేట్లో ఉన్న తీసివేసి కొత్త నీటిని పోసి ఉత్తర దిక్కు వైపే పెట్టాలి. ప్లేట్ లో నీళ్లు పోసేటప్పుడు మన మనస్సులో ఉన్న కోరికను తలుచుకుంటూ నీటిని పోయాలి. ఉత్తర దిక్కులోనే పెట్టడానికి కారణం అది కుబేర స్థానం కాబట్టి.

ఏ దిశలో ..ఎలాంటి తాబేలును పెట్టాలి?

మెటల్ తాబేలును ఉత్తర లేదా వాయువ్య దిశలో ఉంచాలి. అదే చెక్క తాబేలు అయితే తూర్పు లేదా ఆగ్నేయం వైపు, పెట్టాలి. క్రిస్టల్ లేదా గ్లాస్ తాబేలు ప్రతిమ పెట్టడానికి నైరుతి లేదా వాయువ్య దిశ అనుకూలమైంది. రాతి తాబేలైతే పశ్చిమ దిక్కు ఉత్తమమైంది.

తాబేలు ఏ రోజు ఇంట్లో పెట్టాలి?

తాబేలు ఉన్న నివాసాల్లో వాస్తు దోషాలు ఉంటే కొంత వరకు దోష నివారణ జరుగుతుందని నమ్మకం. ఆ ఇంట్లో ఉన్న మనుషులకి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే షాపులలో ఉంచితే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.
చైనీస్ పురాణాలలో నల్ల తాబేలు దీర్ఘాయువును సూచించే ఆధ్యాత్మిక జీవిగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని కేంద్రీకరించడానికి కూడా సహాయపడుతుంది. ఇంట్లో తాబేలు బొమ్మలను ఉంచడానికి బుధవారం, గురువారం, శుక్రవారం ఉత్తమమైన రోజులుగా భావిస్తారు.

Tags

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×