BigTV English

New Zealand vs Afghanistan : న్యూజిలాండ్ ముందు చేతులెత్తేసిన ఆఫ్గాన్

New Zealand vs Afghanistan : న్యూజిలాండ్ ముందు చేతులెత్తేసిన ఆఫ్గాన్

New Zealand vs Afghanistan : అన్నిరోజులు మనవి కావు…అన్ని కాలాల్లో వసంత రుతువు ఉండదు. ఈ నిజం ఆఫ్గనిస్తాన్ కు వెంటనే తెలిసి వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండుని ఓడించిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ 145 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
న్యూజిలాండ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. క్లిష్ట సమయంలో బ్యాటింగ్ చేసి…భారీ టార్గెట్ ని ఆఫ్గాన్ ముందు పెట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. ఛేజింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది.


చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ పలు అంచనాల మధ్య ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సంచలనాలు నమోదు చేసిన చిన్న జట్లు రెట్టించిన ఉత్సాహంతో గట్టి పోటీనిస్తాయని అంతా భావించారు. ఈ దశలో  డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండుని ఓడించిన ఆఫ్గాన్ ఈసారి కూడా న్యూజిలాండ్ కి షాక్ ఇస్తుందనుకున్నారు. కానీ తనే ఖంగుతిన్నాది.

వివరాల్లోకి వెళితే టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అదెంత పొరపాటు నిర్ణయమో తర్వాత వారికి అర్థమైంది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జాగ్రత్తగా ఆడుతూ పాడుతూ 6 వికెట్లకు 288 పరుగులు చేశారు.
ఓపెనర్ విల్ యంగ్ (54) శుభారంభం అందించాడు. మరో ఓపెనర్ కాన్వే 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి 6.3 ఓవర్లలో స్కోరుబోర్డు 30 పరుగులు ఉంది. తర్వాత 20 ఓవర్ల వరకు మ్యాచ్ సాఫీగానే సాగింది.  సరిగ్గా  21 ఓవర్ లో మ్యాజిక్ జరిగింది. రచిన్ రవీంద్ర (32), యంగ్ (54), డేరీ మిచెల్ (1) వెంట వెంటనే అవుట్ అయ్యారు.


ఆఫ్గాన్ కి మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని అంతా అనుకున్నారు. అజ్మతుల్లా బౌలింగ్ వేసిన ఒకే ఓవర్ లో  రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత 22 ఓవర్ వేసేందుకు వచ్చిన స్పిన్నర్ రషీద్ ఖాన్ కి మరో వికెట్టు వచ్చింది. అంటే 9 బంతుల తేడాలో 1 పరుగు మాత్రమే వచ్చింది. మూడు వికెట్లు ఠపీఠపీ మని పడిపోయాయి. ఆ సమయంలో న్యూజిలాండ్ 110 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మళ్లీ ఇంగ్లండ్ సీన్ రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు.
రాబోవు రోజుల్లో ఆఫ్గాన్ ని నిలువరించడం పెద్ద జట్లకి కష్టమని కూడా అంతా అనుకున్నారు.

ఆ సమయంలో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లూథమ్ (68) , గ్లెన్ ఫిలిప్స్ (71) సాయంతో జట్టుని ఆదుకున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాడు. ఇంగ్లాండుకి జరిగిన ఘోర అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని తమ అనుభవాన్నంత రంగరించి జాగ్రత్తగా ఆడాడు. ఇక చివర్లో మార్క్ చాప్ మన్ (25) వచ్చి ఎడాపెడా బాదేశాడు. దీంతో న్యూజిలాండ్ 288 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆఫ్గాన్ బౌలర్లలో ఒమర్ జాయ్ 2, నవీనుల్ హక్ 2, రెహ్మాన్, రషీద్ ఖాన్ తలా ఒక వికెట్ తీశారు.

ఛేజింగ్ కి వచ్చిన ఆఫ్గానిస్తాన్ ఏ దశలోనూ మ్యాచ్ పై పట్టు సాధించలేదు. ఇంగ్లండు మీద మెరిసిన ఓపెనర్ గుర్భాజ్(11) ఈసారి తేలిపోయాడు. మరో ఓపెనర్ ఇబ్రహిం (14) కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 27 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ పెవెలియన్ కి చేరారు. రెహ్మత్ షా (36),  ఒమర్జాయ్ (27) ఇద్దరూ కాసేపు న్యూజిలాండ్ ని నిలువరించారు. ఒక దశలో 90 పరుగులకి 3 వికెట్లతో పటిష్టంగా కనిపించిన ఆఫ్గాన్ తర్వాత పేకమేడలా కుప్పకూలిపోయింది. 34.4 ఓవర్లలో 139 పరుగలకి చాప చుట్టేసింది.

 49 పరుగులకి మిగిలిన 7 వికెట్లను కోల్పోయింది. ఒక దశలో న్యూజిలాండ్ ఫీల్డర్లకి క్యాచ్ ప్రాక్టీసు కోసం వచ్చినట్టుగా ఆఫ్గాన్ ఆటగాళ్లు ఆడారు. గాల్లోకి కొట్టడం, ఫీల్డర్ క్యాచ్ పట్టాడా? లేదా చూసుకోవడం…పెవెలియన్ కి వెళ్లిపోవడం వెంటవెంటనే జరిగింది.

న్యూజిలాండ్ బౌలర్లలో ఫెర్గూసన్ 3, శాంటర్న్ 3, బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్టు తీశారు.

దీంతో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో వరుస విజయాలతో 8 పాయింట్లతో అగ్రస్థానానికి న్యూజిలాండ్ చేరింది. ఆఫ్గానిస్తాన్ తొమ్మిదో స్థానంలో నిలిచింది.

Related News

IPL 2026: ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. షాక్ లో ప్లేయర్లు… ఇకపై అక్కడ ఒక మ్యాచ్ ఆడాల్సిందే

IND Vs PAK : టీమిండియాతో ఫైన‌ల్‌..ఓపెన‌ర్ గా షాహీన్ అఫ్రిదీ..పాక్ అదిరిపోయే ప్లాన్‌

IND VS PAK Final: ఇండియాను వ‌ణికిస్తున్న పాత రికార్డులు..అదే జ‌రిగితే పాకిస్థాన్ ఛాంపియ‌న్ కావ‌డం పక్కా ?

IND Vs PAK : నోరు జారిన షోయబ్ అక్తర్.. అభిషేక్ బచ్చన్ ను సీన్ లోకి లాగి

IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వ‌నున్న‌ నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!

IND Vs PAK : ‘షేక్ హ్యాండ్’ వివాదం పై పాకిస్తాన్ కెప్టెన్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

NEP-WI : నేపాల్ సరికొత్త చరిత్ర.. వెస్టిండీస్ జట్టుపై చారిత్రాత్మక విజయం 18వ ర్యాంక్ లో ఉండి వణుకు పుట్టించింది

IND vs PAK Final: నేడు ఆసియా క‌ప్‌ ఫైన‌ల్స్‌..పాండ్యా దూరం..టెన్ష‌న్ లో టీమిండియా, టైమింగ్స్‌..ఉచితంగా ఎలా చూడాలి

Big Stories

×