E-Paper
Advertisement

Railways New Service:దిగాల్సిన స్టేషన్ ఇక మిస్ కాదు.. రైల్వే శాఖ కొత్త సర్వీస్..

Railways New Service:దిగాల్సిన స్టేషన్ ఇక మిస్ కాదు.. రైల్వే శాఖ కొత్త సర్వీస్..
Advertisement

Railways New Service:రైళ్లలో రాత్రి పూట ప్రయాణాలు చేసే వాళ్లు… గాఢ నిద్ర కారణంగా దిగాల్సిన స్టేషన్ మిస్ కావడం చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. మొబైల్లో అలారం పెట్టుకున్నా అది సరిగ్గా సమయానికి మోగకపోవడం, దిగాల్సిన స్టేషన్ వచ్చిందని అలర్ట్ చేసేవాళ్లు ఎవరూ లేకపోవడం వల్ల… చాలా దూరం ప్రయాణించాక గానీ కొందరికి మెలకువ రాదు. దాంతో… లేచాక వచ్చే స్టేషన్లో దిగిపోయి.. మళ్లీ వెనక్కి రావడం చాలా మంది రైలు ప్రయాణికులకు అనుభవమే. ఇకపై ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టింది… రైల్వే శాఖ. దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికులను అలర్ట్ చేసేలా కొత్త సర్వీసు ప్రవేశపెట్టింది.

రైల్వే శాఖ ప్రారంభించిన ఈ ప్రత్యేక సేవ పేరు ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’. రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కి కాల్ చేసి విచారణ వ్యవస్థలో అలర్ట్ సౌకర్యం కోసం అడగవచ్చు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని ప్రయాణికులెవరైనా వినియోగించుకోవచ్చు. ఒకసారి అలర్ట్ సౌకర్యం తీసుకుంటే… ప్రయాణికులు దిగాల్సిన స్టేషన్‌ రావడానికి 20 నిమిషాల ముందే వారి ఫోన్‌కు అలర్ట్ వస్తుంది. దాంతో… ముందుగానే మేల్కొని స్టేషన్ రాగానే దిగిపోయే అవకాశం ఉంటుంది.

Advertisement

‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ని సేవను పొందేందుకు… రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ 139కి కాల్ చేయాలి. భాషను ఎంచుకున్న తర్వాత, గమ్యస్థాన హెచ్చరిక కోసం ముందుగా నంబర్ 7ని నొక్కాలి. ఆ తర్వాత నంబర్ 2ని నొక్కి… 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ నమోదు చేయాలి. దాన్ని నిర్ధారించడానికి 1 డయల్ చేయాలి. అంతే… ఆ పీఎన్ఆర్ నెంబర్ ఉన్న మొబైల్ నెంబరుకు… ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. దిగాల్సిన స్టేషన్ రావడానికి 20 నిమిషాల ముందే ప్రయాణికుల ఫోన్‌కు అలర్ట్ వస్తుంది.

Subscription Sharges:మస్క్ బాటలో మార్క్

Gold Rates : నేడు బంగారం ధర ఎంతో తెలుసా..?

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×