BigTV English

IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?

IT Sector:టెక్నాలజీని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు. టెక్నాలజీ వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయని కొందరు నిపుణులు ప్రతికూలతను వ్యాప్తి చేశారు. దీంతో కొన్నాళ్ల క్రితం మనుషులు టెక్నాలజీని నమ్మడం తగ్గించారు. కానీ విశ్వంలో పుట్టుకొస్తున్న ప్రతీ కొత్త సమస్యకు టెక్నాలజీనే సమాధానం అందించడంతో.. ప్రస్తుతం మానవాళి అనేది పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి ఉంది.


ఇప్పటికీ భూగ్రహంపై ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ టెక్నాలజీతో పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. పర్యావరణంలో వస్తున్న మార్పులతో సహా. అయితే ఈ ప్రక్రియలో పాత టెక్నాలజీలను పక్కన పెట్టి కొత్త టెక్నాలజీలను మార్కెట్లోకి తీసుకురావాలన్న ప్రయత్నం క్రియేటివ్ డిస్ట్రక్షన్‌కు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1942లో మొదటిగా క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది జరిగింది.

1942లో కొత్త రకమైన పరిశ్రమలు ఏర్పాటు కావడం వల్ల ఆర్థికంగా ప్రపంచం ముందుకెళ్లింది. కానీ అదే సమయంలో పాత పరిశ్రమలకు నష్టం కలిగింది. దీని వల్ల క్రియేటివ్ డిస్ట్రక్షన్ మొదలయ్యింది. ఇక గత కొన్నాళ్లలో టెక్నికల్ రంగంలో పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. ఆ పెట్టుబడుల వల్ల ఆదాయం, లాభం కూడా పెరిగింది. అయితే టెక్నాలజీ రంగంలో ఎక్కువ రిస్క్ ఉంటేనే ఎక్కువ లాభం ఉంటుంది. అందుకే రిస్క్ ఉన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆలోచిస్తున్నారు.


కేవలం ప్రకటనలతోనే ఆదాయం అందుకునే రంగాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ గురించి పనిచేసే ఐటీ సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థల చుట్టూనే ఇప్పటికీ టెక్నాలజీ డెవలప్‌మెంట్ తిరుగుతూ ఉంది. ఈ సెక్టార్ అందుకే షేర్స్ విషయంలో నష్టాలను చవిచూస్తూ వస్తోంది. మామూలుగా బయట నుండి చూసేవారికి టెక్నాలజీ రంగం మామూలుగానే అనిపించినా.. ఎంతోకాలంగా ఇది నష్టాల్లో ఉందని నిపుణులు చెప్తున్నారు.

2022లో కూడా అలాగే జరిగింది. గతేడాది టెక్నాలజీ రంగంలో వచ్చిన నష్టాన్ని చూస్తుంటే.. కొన్నాళ్ల వరకు మళ్లీ ఐటీ రంగం లాభాలను చూడడం కష్టమని నిపుణులు తేల్చేశారు. కొన్ని అభివృద్ధి చెందిన సంస్థల స్టాక్స్ విలువ కూడా దాదాపు 70 శాతం తగ్గిపోవడమే దీనికి ఉదాహరణ. అయితే ఇదంతా మామూలుగా మారి.. ఐటీ సంస్థలకు పెట్టుబడులు పెరిగి లాభాలను చూడడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Water Problems : నీటి సమస్యలను దూరం చేసే కొత్త మార్గం..

Changes in Space : నక్షత్రాల ఏర్పాటుతో అంతరిక్షంలో మార్పులు..

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×