BigTV English

Raja Shyamala Devi Pooja: రాజ్యశ్యామల యాగంతో ఫలితం కలిగేదప్పుడే…

Raja Shyamala Devi Pooja: రాజ్యశ్యామల యాగంతో ఫలితం కలిగేదప్పుడే…

Raja Shyamala Devi Pooja:మన దేశంలో పురాణకాలం నుంచి వివిధ రకాలైన యాగాలు జరిగాయి. యజ్ఞం లేదా యాగం అంతిమ లక్ష్యం దేవతలకు తృప్తి కలిగించడమే. వారిని మెప్పించడమే. సాధారణంగా యజ్ఞం అనేది అగ్నిహోత్రం ద్వారా వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో ‘వేసినవి’ దేవతలందరికి చేరుతాయని విశ్వాసం. దేవతలు సంతృప్తి చెందితే యాగం చేసిన వారి కోరికలు నెరవేరతాయని అంటారు . యుద్దాల్లో విజయం సిద్ధిస్తుందని చెబుతారు.


రాజ్యలక్ష్మి వరించాలని..విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామలయాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసిస్తారు. మహాభారతంలో ప్రస్తావించిన రాజసూయగం కూడా ఇలాంటిదే . రాజ్యం నిలబడడానికి, నా విజయానికి ఎదురులేదని చెప్పడానికి, శత్రువు తన ఎదురు నిలిచేందుకు కూడా సాహసించలేడని చెప్పేందుకు ప్రతీక. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు, పురాణాల్లో చేసిన రాజసూయ యాగం-రాజకీయ నాయకులు నిర్వహించే రాజ శ్యామల యాగం రెండూ ఒకటే. మొదటిది అధికారం శాశ్వతంగా ఉండటానికి .. రెండోది విజయ కాంక్షతో చేసేది.

పూర్వ కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు పురోహితులతో రాజ శ్యామల యాగాలు, చండీ యాగాలు, శత్రు సంహార యాగాలు నిర్వహించేవారు. విజయాలు సాధించేవారు. చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు రాజశ్యామల యాగం చేశారు. తన అధికారం పదిలపరచుకునేందుకు రాజశ్యామల యాగం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత దక్షిణ భారతదేశంలో ఇంకెవరూ రాజశ్యామల యాగం చేసిన దాఖలాలు లేవు. రాజా శ్యామల యాగం రెండు పద్ధతుల్లో నిర్వహిస్తారు. మొదటిది వామాచార పద్ధతి. ఇందులో పూలు పండ్లతో శాకాహార పద్ధతిలో యాగం నిర్వహిస్తారు. రెండోది దక్షిణాచార పద్ధతి.. ప్రధానంగా మద్యం, మాంసం ఉపయోగించి చేస్తారు. దీని ద్వారా విపరీతమైన రాజ యోగం సిద్ధిస్తుందని నమ్ముతారు.


Related News

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×