BigTV English
Advertisement

Shaligram: గండకీ నది నుంచి పుట్టిన సాలగ్రామాలు

Shaligram: గండకీ నది నుంచి పుట్టిన సాలగ్రామాలు

Shaligram: సాలగ్రామం అంటే దేవాలయాల సమూహమని అర్థం. గ్రామాల సమూహం. ఇంట్లో ఒక సాలగ్రామం ఉంటే సకల దేవతలు ఉన్నట్టే. సాలగ్రామ అనేవి సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు స్వరూపాలు. సాలగ్రామాల్ని నిత్యం అర్చన చేస్తూ, అభిషేకం చేస్తూ మంత్రాన్ని జపించడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందచ్చు. వీటికి ప్రాణ ప్రతిష్టతో పనిలేదు. సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము లేకుండా పూజలు చేయరు.


సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు. హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి.సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చన వల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలను మార్గశిర మాసంలో శుభ్రమైన నీటితో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. సాలగ్రామానికి చేసిన అభిషేకం నీళ్లను నెత్తిన చల్లుకుంటే సర్వరోగాలు మటుమాయం అవుతాయి. పవిత్ర గంగానది నీటితో శుద్ధం చేసిన ఫలితంతో సమానం. సాలగ్రామాలపై స్వస్తిక్ సింబల్ గీస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను సాలగ్రామంను నేలపై పెట్టరాదు.

వైష్ణవ పురాణాలు, ఇతర వైష్ణవ గ్రంధాలు సాలగ్రామాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. .నేపాల్ దేశంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాక్షేత్రంలో లభిస్తాయి.గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. సాలగ్రామం ఎంత చిన్నగా ఉంటే ఫలితాలు అంత ఎక్కువగా ఉంటాయి. సాలగ్రామం పెచ్చు ఊడిపోయిన, విరిగినా పూజకు పనికి వస్తాయి. కానీ వంకర, టింకరగా ఉన్నసాలగ్రామాలను పూజల్లో వినియోగించకూడదని శాస్త్రం చెబుతోంది.


పాతాళ నారసింహ,గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు,సీతారామ,గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకోవాలంటారు.
పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు..సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి.

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×