BigTV English

Redmi Note 12 5G series hits record sales : వామ్మో.. ఆ రేంజ్‌లో కొనేశారా?

Redmi Note 12 5G series hits record sales : వామ్మో.. ఆ రేంజ్‌లో కొనేశారా?


Redmi Note 12 5G series hits record sales : వారం రోజులు… రూ.300 కోట్లు… ఇదేంటనుకుంటున్నారా? దేశంలో ఒక్క వారం వ్యవధిలో అమ్ముడుపోయిన ఓ కంపెనీ స్మార్ట్ ఫోన్ల విలువ అది. అంటే రోజుకు దాదాపు రూ.43 కోట్ల విలువైన ఫోన్లు అమ్ముడుపోయాయన్న మాట. ఇంతకీ వినియోగదారులు ఆ రేంజ్‌లో కొన్న ఫోన్ ఏంటో తెలుసా? నోట్‌ సిరీస్‌లో కొత్తగా విడుదలైన రెడ్‌మీ నోట్ 12 5G. జనవరి 11న రెడ్‌మీ కంపెనీ నోట్‌ సిరీస్‌లో కొత్త 12 5G మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. విడుదలైన వారంలోనే రూ.300 కోట్ల విలువైన నోట్ 12 5G ఫోన్లు అమ్ముడుపోయాయని రెడ్‌మీ ఇండియా తెలిపింది. భారత మార్కెట్లో తమ ఫోన్లకు దక్కుతున్న ఆదరణకు ఇది ఒక నిదర్శమని ఒక ప్రకటనలో పేర్కొంది.

బడ్జెట్‌ ధరలో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్‌ కావాలంటే… ఎక్కువ మంది రెడ్‌మీ కొనేందుకే ఇష్టపడతారు. షావోమి సబ్‌బ్రాండ్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన రెడ్‌మీ… అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో స్మార్ట్‌ ఫోన్లు విడుదల చేస్తూ యూజర్లకు చేరువైంది. ముఖ్యంగా రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్‌ సిరీస్‌ ఫోన్లకు భారత్‌లో ఆదరణ ఎక్కువ. నోట్‌ 12 5G సిరీస్‌ తీసుకొస్తున్నట్లు రెడ్‌మీ ప్రకటించాక… దాదాపు 80 లక్షల మంది ఈ మోడల్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికారు. రెడ్‌మీ నోట్‌ 12 5G సిరీస్‌లో మూడు వేరియంట్లు ఉన్నాయి. రెడ్‌మీ నోట్‌ 12 5G, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5G, రెడ్‌మీ నోట్‌ 12 ప్రో+5G. వీటిలో రెడ్‌మీ నోట్‌ 12 5G ప్రారంభ ధర రూ.18 వేలు. ఇక రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5G ధర రూ.25 వేల నుంచి ప్రారంభమవుతుండగా… రెడ్‌మీ నోట్ 12 ప్రో+ 5G ప్రారంభ ధర రూ.30 వేలు ఉంది.


రెడ్‌మీ నోట్‌ సిరీస్‌ భారత మార్కెట్లోకి విడుదలై ఈ ఏడాదితో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నోట్‌ సిరీస్‌ను ఆదరిస్తున్న భారత యూజర్లకు ధన్యవాదాలు తెలిపిన షావోమీ ఇండియా… తక్కువ ధరలో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో యూజర్లకు మెరుగైన ఉత్పత్తుల అందివ్వడమే తమ లక్ష్యమని పేర్కొంది.

Follow this link for more updates : Bigtv

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×