BigTV English

Temple: అమెరికాలోని హిందూ ఆలయంలో భారీ దొంగతనం

Temple: అమెరికాలోని హిందూ ఆలయంలో భారీ దొంగతనం

Temple: అమెరికా టెక్సాస్‌లోని బ్రజోస్ వ్యాలీలో ఉన్న ఏకైక హిందూ ఆలయం శ్రీఓంకారనాథ్ దేవాలయం. నిత్యం ఇక్కడికి పెద్ద సంఖ్యలో హిందువులు, భారతీయులు వస్తుంటారు. వారాంతాల్లో, పండుగరోజుల్లో అత్యంత రద్దీగా ఉంటుంది ఈ ఆలయం.


ఇటీవల ఈ ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఓ కేటుగాడు ఆలయంలోకి చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడు. ఈ దోపిడీ జరిగి దాదాపు 10 రోజులు అయినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 11వ తేదీన ఈ దోపిడీ జరిగింది. ఓ దొంగ ఆలయం యొక్క పక్క కిటికీలోంచి లోపలికి చొరబడి హుండీతో పాటు పలు విలువైన వస్తువులను అపహరించాడు. మరునాడు ఉదయం ఆలయ పూజారి ఈ దోపిడీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసిన బ్రజోస్ వ్యాలీ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు దోపిడీకి పాల్పడిన దృశ్యాలు ఆలయ సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి. వాటి సాయంతో పోలీసలుు దర్యాప్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.


Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×