Big Stories

Rohini Karti:- రోహిణి కార్తెకి రాళ్లకి సంబంధమేంటి…?

Rohini Karti:- రోహిణి కార్తెలో రాళ్లు పగులుతాయన్న నానుడి ఉంది. ఎండతీవ్రతకి ఇది అద్దం పడుతుందని అంటారు. రోహిణి కార్తె అనగా మే నెలలో సూర్యభగవానుడు మన నడి నెత్తి మీద కొస్తాడు ,అంటే మధ్య భాగానికి వస్తాడు. చండ్ర ప్రచండుడు గా మారతాడు. ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి.దాంతో భూమి లోపల ఉన్న తేమ అంతా హరించుకుని పోతుంది. రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది. తేమశాతం ఇంకి పోగానే రోళ్లు పగులుతాయి

- Advertisement -

Rohini Karti:- మనం రోజూ చూసే చంద్రుడు రవి గ్రహానికి చెందిన కృత్తికా నక్షత్రంలో జన్మించాడు. ఇందులోనూ మూడు భాగాలు మేషరాశిలో నాలుగో పాదం వృషభ రాశి లోనే ఉంటాయి. గ్రీకులు రోహిణి నక్షత్రం Aldiberon అనే పేరుతో పిలిచారు. ఈ దేవత ఎప్పుడు కళ్ళు మూసుకునే ఉంటుంది. ఈమె ఎవరినైనా కళ్ళు తెరిచి చూస్తే వాళ్లు శిలగా మారి పోయి ఆ శిల అనేక ముక్కలుగా పగిలిపోతుంది. సూర్యుడు వేసవికాలంలో ఈ నక్షత్రం మీద కి వచ్చినప్పుడు మన శాస్త్రాలలో రోహిణి కర్త వచ్చినట్లు లెక్క. పై కథను దృష్టిలో ఉంచుకొని రోహిణి కార్తె కు రోళ్లు పగిలిపోతాయి అనే నానుడి ప్రాచుర్యాన్ని పొందింది.

- Advertisement -

Rohini Karti:- రోహిణి కార్తే మే 25 ఉదయం 8:46 నిమిషాలకు ప్రారంభమై జూన్ 8 ఉదయం 6:41 నిమిషాల వరకు రోహిణి కార్తె ఉంటుంది. రోహిణి కార్తె ఫలితంగా ఈ రోజులలో శనిపై కుజని దృష్టి ఉంటుంది. వృషభరాశిలో పౌర్ణమి వరకు బుధ, శుక్ర, రాహువుల కలయికలున్నవి. అంతేకాకుండా రోహిణి కార్తెలో రవి, రాహుల కలయికలు కుడా ఉండుటచేత వడ గాల్పులు తీవ్రమైతవి, మంచి నీటి ఎద్దడి ఏర్పడును

Rohini Karti:- రోహిణి కార్తె కాలానికి 13 నుండి 14 రోజుల పరిమితి ఉంటుంది. అంటే దాదాపు రెండు వారాలన్న మాట. ఈ సూర్యమానాన్నే తమిళులు కూడా ఆచరిస్తారు. అయితే వారు మాసాలుగా చూస్తారు. ఇలా మొత్తం 27 కార్తెలు ఉంటాయి. అంటే దాదాపు రెండు వారాలన్న మాట. ఈ సూర్యమానాన్నే తమిళులు కూడా ఆచరిస్తారు. అయితే వారు మాసాలుగా చూస్తారు. వీటిని అనుగుణంగా తెలుగు వారు తమ అనుభవాల సారం నుండి సంపాదించుకున్న విజ్ణానమే ఈ కార్తెలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News