E-Paper
Advertisement

Traffic Police : డ్రగ్స్ మత్తులో దారుణం.. కారు బానెట్ పై ట్రాఫిక్ పోలీసు.. 20 కిలోమీటర్లు జర్నీ..

Traffic Police : డ్రగ్స్ మత్తులో దారుణం.. కారు బానెట్ పై ట్రాఫిక్ పోలీసు.. 20 కిలోమీటర్లు జర్నీ..
Advertisement

Traffic Police : మహారాష్ట్రలోని నవీ ముంబై అత్యంత రద్దీ ప్రాంతం. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు కోపర్‌ఖెరాణె-వాశీ మార్గంలో తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించాడు. సిద్ధేశ్వర్‌ మాలి అనే ట్రాఫిక్‌ పోలీసు, మరో పోలీసుతో కలిసి ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మాదకద్రవ్యాలు తీసుకున్నాడన్న అనుమానంతో డ్రైవర్ ను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు సిద్ధేశ్వర్ మాలి కారు బానెట్‌పై పడిపోయాడు.

ఆ పోలీసు కారు బానెట్ పై ఉన్నా సరే ఆ డ్రైవర్ వేగంగా దూసుకెళ్లిపోయాడు. అలా 20 కిలోమీటర్లు తీసుకుపోయాడు. కారును గట్టిగా పట్టుకున్న సిద్ధేశ్వర్ మాలి.. 20 కిలోమీటర్ల వెళ్లిన తర్వాత గవ్హాన్‌ ఫాటా ప్రాంతంలో కింద పడిపోయాడు. ఆ కారును వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

నిందితుడిని 22 ఏళ్ల ఆదిత్య బెంబ్డేగా గుర్తించారు. అతడు మాదకద్రవ్యాలు సేవించినట్లు వైద్య పరీక్షల్లో తేలిందని పోలీసులు తెలిపారు. అతడిపై హత్యాయత్నం, ర్యాష్ డ్రైవింగ్‌, డ్రగ్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో తరచూ జరుగుతున్నాయి. నిందితులు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా తమ వాహనాలతో దూసుకుపోతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు నిందితుల వాహనాల్లో చిక్కుకుపోయిన సందర్భంలోనే ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×