Big Stories

RRB ALP Recruitment 2024 : రైల్వేలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు..!

RRB ALP Recruitment 2024 : నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ జరగనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించనుంది రైల్వే శాఖ. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి స్థాయి ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

- Advertisement -

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు
విద్యార్హత : అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి/ ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌,మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ అర్హులే/ అంతేకాకుండా ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన వాళ్లూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వేతనం : అసిస్టెంట్‌ లోకో పైలట్‌(ALP) ఉద్యోగానికి ఎంపికైన వారికి తొలుత రూ.19,900 వేతనం అందుతుంది. ఇతర సౌకర్యాలు ఉంటాయి.
ఏజ్ లిమిట్ : దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు జులై 1, 2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా ఏజ్ లిమిట్‌లో సడలింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా 21 రైల్వే జోన్‌ల పరిధిలో అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. జోన్‌ల వారీగా పోస్టుల ఖాళీల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్(CBT)లో మెరిట్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితర ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News