E-Paper
Advertisement

Jobs: SBIలో వెయ్యికి పైగా జాబ్స్.. కంప్లీట్ డీటైల్స్..

Jobs: SBIలో వెయ్యికి పైగా జాబ్స్.. కంప్లీట్ డీటైల్స్..
Advertisement
bank jobs

Jobs: బ్యాంక్ జాబ్. చాలామంది డ్రీమ్ రోల్. వైట్ కాలర్ జాబ్స్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్. చమట పట్టదు. చొక్కా నలగదు. సొసైటీలో ఫేమ్. మంచి జీతం. ఏటేటా ఇంక్రిమెంట్. వెంటవెంటనే ప్రమోషన్స్. జాబ్ అంటే బ్యాంక్ జాబే. అందుకే, నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడు బ్యాంక్ జాబ్స్ నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. కానీ, అప్పుడప్పుడు మాత్రమే ఆ జాబ్స్ పడుతుంటాయి. ఇప్పుడు మళ్లీ ఆ సమయం వచ్చింది.

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-SBIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజైంది. కాకపోతే ఇది ఫ్రెషర్స్‌కు మాత్రం కాదు. అల్రెడీ బ్యాంక్ జాబ్ చేసి రిటైర్ అయిన వారికి మాత్రమే. అదికూడా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ మాత్రమే. వెయ్యికి పైగా ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఎస్బీఐ.

Advertisement

గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://sbi.co.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఏప్రిల్ 30. మొత్తం 1,031 పోస్టులు. ఛానల్‌ మేనేజర్‌ ఫెసిలిటేటర్‌, ఛానల్‌ మేనేజర్‌ సూపర్‌వైజర్‌, సపోర్ట్‌ ఉద్యోగాలు ఉన్నాయి. ఛానెల్ మేనేజర్ ఫెసిలిటేటర్‌కు నెలకు రూ.36,000.. ఛానెల్ మేనేజర్ సూపర్‌వైజర్‌కు నెలకు రూ.41,000.. సపోర్ట్ ఆఫీసర్‌కు నెలకు రూ.41,000 జీతం ఉంటుంది.

అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2023 నాటికి కనీసం 60 ఏళ్లు ఉండాలి. గరిష్ఠంగా 63 ఏళ్లు. రిజర్వేషన్ల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

Advertisement

దేశంలో ఎక్కడ కేటాయిస్తే అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. విద్యార్హత గురించి ప్రస్తావించకున్నా.. ATM ఆపరేషన్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపింది. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×