BigTV English

Spider Silk : స్పైడర్ సిల్క్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి..

Spider Silk : స్పైడర్ సిల్క్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి..

Spider Silk : నేచురల్‌గా తయారయ్యే వస్తువులు, వనరులు చాలా బలంగా ఉంటాయని అప్పటి తరం వారు చెప్తుంటారు. కానీ ఆరోజుల్లో తినే ఆహారం కూడా చాలావరకు నేచురల్‌గా ఉందా లేదా అని తెలుసుకునే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో కృత్రిమంగా తయారు చేస్తున్న వస్తువులే ఎక్కువయపోతున్నాయి. అయినా కూడా కొందరు శాస్త్రవేత్తలు నేచురల్ వనరులను తీసుకొని అందులో నుండి వస్తువులను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో స్పైడర్ సిల్క్ కూడా ఒకటి.


స్పైడర్ సిల్క్ అనేది చాలా బలంగా ఉంటుంది. దీని ద్వారా పలు రంగాల్లో ఎన్నో లాభాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే కనిపెట్టారు. అప్పటినుండి దీనిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా స్పైడర్ సిల్క్ గురించి మరింత స్పష్టంగా వారు స్టడీ చేసి కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు అనేక స్పైడర్ సిల్క్ శాంపుల్స్‌ను వారు గమనించారు. వాటిని పరీక్షించి చూశారు. కానీ తాజాగా చేసిన పరిశోధన వాటికి చాలా భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు. దీని ద్వారా బలమైన సింథటిక్ స్పైడర్ సిల్క్‌ను తయారు చేసే అవకాశం కూడా ఉంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కెవ్లర్, పాలిస్టర్, కార్బన్ ఫైబర్ లాంటి క్లాత్ స్థానంలో సింథటిక్ స్పైడర్ సిల్క్‌ను ప్రవేశపెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాంటి వాటికి స్పైడర్ సిల్క్ కరెక్ట్ ప్రత్యామ్నాయం అని వారు తెలిపారు. నేచురల్ స్పైడర్ సిల్క్ అనేది పలు వనరులతో ఏర్పడుతుందని, అందుకే అది స్టీల్ కంటే బలంగా ఉంటుందని చెప్తున్నారు. పైగా ఇది ఎంత బలంగా ఉన్నా కూడా ఎక్కువగా బరువు లేకుండా ఫ్లెక్సిబుల్‌గా, నేచురల్ ఫైబర్‌ను అందిస్తుందని తెలిపారు. కృత్రిమంగా ఇలాంటి సిల్క్‌ను తయారు చేయడం చాలా కష్టమన్నారు.


స్పైడర్స్ ఎక్కువగా ఉన్నా కూడా స్పైడర్ వెబ్స్ అనేవి ఎక్కువగా కనిపించవు. ఎందుకంటే స్పైడర్స్ తమ మూడ్‌ను బట్టి వీటిని ఏర్పాటు చేయడం మొదలుపెడతాయి. పైగా అన్ని స్పైడర్ వెబ్స్‌లో ఫైబర్ అనేది ఉండదని శాస్త్రవేత్తలు తెలిపారు. అయినా కూడా దానిని వెతికి పట్టుకోవాలని అన్నారు. ఈరోజుల్లో కృత్రిమంగా తయారు చేసిన సింథటిక్ ఏదీ దీనికి సాటిరాదని అంటున్నారు. అందుకే స్పైడర్ వెబ్ గురించి, అందులోని సిల్క్ గురించి తెలుసుకోవడం కోసం పలు టెక్నిక్స్ ఉంటాయని వారు కనిపెట్టారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×