Big Stories

Rameswaram : రామేశ్వరంలో సముద్ర స్నానానికి, గోవాలో స్నానానికి తేడా ఏంటి?

Rameswaram : జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం క్షేత్రంలో 22 తీర్థాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఒక్కో తీర్థం ఒక్కో ప్రత్యేకతను .. విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. ఈ 22 తీర్థాలలో ‘జటా తీర్థం’ .. ‘కోటి తీర్థం ముఖ్యమైనవి..రామేశ్వరానికి సమీపంలో ధనుష్కోటి మార్గంలో ‘జటా తీర్థం’ కనిపిస్తుంది.

- Advertisement -

రావణ సంహారం తర్వాత శ్రీరాముడు ఈ తీర్థంలో ముందుగా తన జటలను తడుపుకుని ఆ తరువాత స్నానం చేశాడట. అందుకే ఈ తీర్థానికి ‘జటా తీర్థం’ అనే పేరు వచ్చింది. కోటి తీర్థం విశాలాక్షి అమ్మవారికి తూర్పు వైపున కనిపిస్తుంది. తన మేనమామ అయిన కంసుడిని సంహరించిన శ్రీకృష్ణుడు, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడని స్థలపురాణం చెబుతోంది.

- Advertisement -

పిల్లలు కలగని వారు శాంతులు చేయించి భగవంతుని సేవ చేయడం వల్ల స్వామి చల్లని చూపులతో సంతానం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు రామేశ్వరం వద్ద స్నానం చేస్తే మరింత ఫలం కలుగుతుంది. సముద్రస్నానం ఎక్కడైనా ఒక్కటే కదా అని ఆలోచించకండి. గోవాలో సముద్ర స్నానం చేసి ఎండలో ఉంటే అనేక చర్మవ్యాధులు నయమవుతాయి. అందుకే దేశ విదేశాల నుంచి గోవా వచ్చి అనేక చర్మవ్యాధిగ్రస్థులు నెలలు తరబడి ఉంటుంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కో శక్తి ఉంటుంది. ఇంట్లో పూజామందిరంలో ఉండే దేవునికి గుడిలో ఉండే దేవునికి ఎంతో తేడా ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News