Weddings:రెండు జీవితాలను కలిపే పెళ్లికి ముహూర్తం విషయంలో హిందుమతంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. శుభనక్షత్రాలు, తిథులు చూసుకుని చేస్తుంటారు. పండితుల సూచనలు సలహాలతో అవసరమైతే వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొంతమంది ప్రత్యేకంగా ఈరోజుల్లో పెళ్లిళ్లు చేయకూడదన్న సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. వారంలోని ఏడు రోజులు పెళ్ళిళ్లకు అనుకూలమైనప్పటికీ శుక్రవారం విషయంలో కొంతమందికి పుట్టింపు ఉంటుంది.
శుక్రవారం పెళ్లిళ్లు జరిపించవచ్చా అనే సందేహం కూడా కలుగుతుంది. చాలామంది వీలైనంతవరకు శుక్రవారం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కాకపోతే కొన్ని జాతకాల వల్ల లేక పేరు బలాలు వల్ల శుక్రవారం ముహూర్తాలను పెట్టుకుంటూ ఉంటారు.మన హిందువులు శుక్రవారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి కి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తారు.
అందుకోసమే శుక్రవారం అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అదేవిధంగా మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అమ్మాయికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతుంటారు. ఈ విధంగా మరో ఇంటికి అమ్మాయిని పంపించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్లి పోతుందని భావిస్తుంటారు. అలాగే అమ్మాయికి లక్ష్మీదేవి విగ్రహం లాంటివి కూడా ఇవ్వడానికి ఇష్టపడరు.
ఎవరైతే శుక్రవారం వివాహం జరిపిస్తారో అలాంటివారు వారి అమ్మాయిని అదే రోజు అత్తింటికి పంపించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అమ్మాయిని అత్తింటివారు తీసుకెళ్లే ముందు అత్తింటి వారిని మన ఇంటి గడప పై ఒక చిన్న బంగారు వస్తువునైనా ఉంచి మన ఇంట్లోని ఆడపిల్లను వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు.ఈ విధంగా శుక్రవారం బంగారం రూపంలో మన ఇంటికి మహాలక్ష్మి వస్తే, వారి ఇంటికి మహాలక్ష్మిగా నవ వధువు అత్తవారింట్లో కాలు పెడుతుంది.
Temple:ఆలయానికి ఒట్టి చేతులతో వెళ్లకూడదా….
Ramcharan : ఢిల్లీలో రామ్ చరణ్ సందడి.. మోదీతో భేటీపై ఆసక్తి..