Big Stories

Rain: బీ అలెర్ట్.. ఏపీ, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు..

Rain: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు ఉపశమనం లభించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రెండురోజులుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శని, ఆది వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వివరించింది.

- Advertisement -

ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సుమద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

ముఖ్యంగా ఏపీలో కాకినాడ, తూర్పు గోదావరి, అల్లూరి, మన్యం, విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీకాకుళం, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వివరించింది. వీలైనంత వరకు వర్షం పడుతున్న సమయంలో జనాలు బయటకు రావొద్దని సూచించింది. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నష్టపోకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Gujarat: నాకు అతని భార్య కావాలి.. కోర్టు మెట్లెక్కిన యువకుడు

Liver Cells : ట్యూమర్‌ రాకుండా కాపాడే లివర్ సెల్స్..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News