E-Paper
Advertisement

HOLYWATER : పుణ్యక్షేత్రాల్లో నీరు తాగకూడదా….

HOLYWATER : పుణ్యక్షేత్రాల్లో నీరు తాగకూడదా….
Advertisement
HOLYWATER

హిమాచల్ ప్రదేశ్ లోని మణికరన్‌లో వేడినీటి బుగ్గలు కనిపిస్తుంటాయి. ఎముకలు కొరికే చలిలో సైతం ఆ బుగ్గల్లోని నీళ్లు పొగలు కక్కుతాయి. బిందెల్లో బియ్యం వేసి ఎసరు పోసి ఆ నీళ్లలో ఉంచితే కాసేపట్లో అన్నం ఉడుకుతుంది. . అలా వండిన అన్నం, పప్పులనే గురుద్వార్‌లో నిత్యం గురు నానక్‌కు నైవేద్యంగా పెడతారు. లంగరులో అన్నదానానికీ అలా వండిన అన్నమే ఉపయోగిస్తారు. మరో బుగ్గలో భక్తులు స్నానమాచరిస్తారు.

అత్యంత చలి ప్రదేశాలైన కేధార్ నాథ్, బదరీనాథ్ ప్రయాణంలో అనేక చోట్ల ఉష్ణనీటి కుండలాలు కనిపిస్తుంటాయి. అలాంటి చల్లని మంచు ప్రదేశాల్లో అంతటి వేడి నీరు కొండల్లో నుంచి రావడానికి కారణం గంధకం అదే సల్ఫర్. గంధకం కొండల గుండా ప్రవహించడం వల్ల నీరు అంత వేడిగా మారుతుంది. ఎంతో మంది వైద్య నిపుణులు, పరిశోధకులు పరిశోధనలు చేసిన ఆ వేడి నీటి కుండాల్లో స్నానం చేయడం మంచిది కాదని సూచించారు. పరిశోధనలు చేసి ఎక్కువ సేపు ఇలాంటి స్నానం మంచిది కాదని సూచించారు. అలాగే పవిత్ర అద్భుతమైన పుణ్య క్షేత్రాల్లో స్వచ్చమైన నీరు పుష్కలంగా పారుతు కనిపిస్తుంటిది. కాలుష్యానికి ఎలాంటి అవకాశం లేని ప్రదేశమని ఈ నీటిని కొందరు తాగుతూ ఉంటారు.

Advertisement

కొండల్లో వచ్చే నీరు స్వచ్ఛమైనదే. అందులో మరో మాట లేదు. కాలుష్యం ఉండదను అనే మాట కూడా నూటికి నూరు శాతం నిజం. కానీ అది మంచు కరిగిన నీరు కూడా కావచ్చు. లేదా అనేక శిలల నుంచి విష శిలల నుంచి కరిగిన నీరు కూడా కావచ్చు. విష వృక్షాల నుంచి వచ్చిన నీరు కూడా కావచ్చు. కాబట్టి పుణ్యక్షేత్రాల్లో తాగేటప్పుడు ఒకసారి ఆలోచించాలని చెబుతుంటారు. నీరు స్వచ్చమైనదే అయినా అందులో కలిసే మూలకాల సంగతి గుర్తించాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×