E-Paper
Advertisement

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!
Advertisement

Medchal: స్వేచ్చ బ్యూరో: మేడ్చల్ పట్టణంలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారి నుంచి గ్రంథాలయానికి వెళ్లే హౌజింగ్ బోర్డు కాలనీ రోడ్డులో వర్షపు నీటితో ఏర్పడిన గుంతల్లో స్థానిక మహిళలతో కలిసి వరి నాట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ..

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత బాసురాది భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌లో విలీనం చేసిన తర్వాత రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. హౌజింగ్ బోర్డు కాలనీ, కేఎస్ఆర్ వెంచర్, కిందిబస్తీ, బాలాజీనగర్, ఉమానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, తెరిచి ఉన్న మ్యాన్‌హోళ్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఫాగింగ్ నిర్వహించడం వంటి కనీస చర్యలు కూడా చేపట్టడం లేదని ఆరోపించారు.

Advertisement

Also read: రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ప్రభుత్వం నిర్లక్ష్యం..

ఏసీపీ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రి, పశువైద్యశాల, వ్యవసాయ శాఖ, పాస్‌పోర్ట్ కార్యాలయం, బాలికల పాఠశాల, రైల్వే స్టేషన్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి ఇదేనని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన భాస్కర్ యాదవ్, మేడ్చల్ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ఈ నిరసనలో బీఆర్ఎస్ నాయకులు దయానంద్ యాదవ్, నవీన్ రెడ్డి, విష్ణుచారి, నడికొప్పు నాగరాజు ముదిరాజ్, సందీప్ గౌడ్, శంకర్, పద్మతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Also read: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×