BigTV English

God :- దేవుడ్ని కోరికలు కోరుకోకూడదా…?

God :- దేవుడ్ని కోరికలు కోరుకోకూడదా…?

God :- అమ్మవారిని ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు యేమి కోరుకున్నామో అవి బాధించకుండా కాపాడతాయి. అమ్మవారిని లౌకిక కోరికలు కోరుకుంటే ప్రయోజనం యేమిటంటే అవి మనల్ని మోహంలో బంధించవు, బాధించవు. అందుకు లౌకికమైన కోరికైనా అమ్మవారిని అడగవచ్చు. కొందరంటూంటారు భగవంతుడిని యేమీ కోరుకోకూడదు అని. అది చాలా తప్పు మాట. కోరికల కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అంటే మళ్ళీ ఇది తప్పే. మిగిలిన వారిని అడిగి కోరికలు తీర్చుకుంటే ఆ కోరికలు మనల్ని బంధిస్తాయి, బాధిస్తాయి. అమ్మవారి వల్ల తీర్చుకుంటే అమ్మవారి దయవల్ల వచ్చింది అనే స్పృహ ఉంటుంది.


భగవంతుడి దయవల్ల అని నానుడిగా మనలో వచ్చేసింది. రామకష్ణ పరమహంస ఒక మాట అనేవారట. అమ్మ దయవల్లే అన్నీ ఉన్నాయి, అమ్మ దయ ఉంటే అన్నే ఉన్నట్లే. ఈ మాట అర్థం ఏదైనా అమ్మ దయే. అనుభవించే ప్రతిదానిలోనూ అమ్మనే ధ్యానం చేస్తున్నాం. గ్లాసు నీళ్ళు చేతితో పట్టుకుంటే ఇందులో దాహం తీర్చే శక్తిగా అమ్మ ఉంది. ఇలా ప్రతి పదార్థంలోను ప్రయోజనకారిగా అమ్మయే ఉన్నదనే భావం .

దేవుడ్ని కోరే కోరికలు ఇతరులకి కీడు చేసేవి కాకూకడదు. నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి.. అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం.. అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. అలాగే నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి. అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే, నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అని కోరుకోవాలి.. అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..


మిగతా దేవుళ్లతో పోల్చితే సీతారాములు స్పెషల్

for more updates follow this link:-Bigtv

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×